Share News

Visakha: శివాజీనగర్‌లో ముగియనున్న లోకేష్ యావగళం పాదయాత్ర

ABN , Publish Date - Dec 18 , 2023 | 07:49 AM

విశాఖపట్నం: సీఎం జగన్ పాలనలో బాధితులుగా మారిన రాష్ట్ర ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం పరిసమాప్తం కానుంది.

Visakha: శివాజీనగర్‌లో ముగియనున్న లోకేష్ యావగళం పాదయాత్ర

విశాఖపట్నం: సీఎం జగన్ పాలనలో బాధితులుగా మారిన రాష్ట్ర ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం పరిసమాప్తం కానుంది. గ్రేటర్ విశాఖ, శివాజీనగర్‌లో ముగియనుంది. ప్రజాగళమై సాగిన ఈ యాత్ర.. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీవరదరాజస్వామి పాదాల వద్ద ప్రారంభమై.. ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యమే ధ్యేయంగా ముందుకు సాగింది.

లోకేష్ పాదయాత్రలో కొన్ని ముఖ్య ఘట్టాలు

11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2,028 గ్రామాల మీదగా పాదయాత్ర కొనసాగింది. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర యవగళం పాదయాత్ర సాగింది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం శ్రీ వరదరాజుస్వామి పాదాల చెంత వద్ద లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. అనివార్యమైన సందర్భాల్లో మినహా యవగళం పాదయాత్రకు ఏనాడూ విరామం ప్రకటించలేదు. సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టుతో పోదలాడ వద్ద పాదయాత్రకు 79 రోజులపాటు తాత్కాలిక విరామం ఇచ్చారు.

పాదయాత్రలో లోకేష్ మాటలు తూటాలతో వైసీపీ అవినీతిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. ప్రతి జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు అనూహ స్పందన వచ్చింది. పాదయాత్రలో లోకేష్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం జీవో నంబర్ 1 సాకుతో లోకేష్ ప్రచార రథం నిలబడ్డ స్టూల్ వరకు లాగేసి గొంతు నొక్కే ప్రయత్నం చేసింది. యువగళం వాలంటీర్లు 40 మందిపై కేసు నమోదు చేయడంతో జైలుకు వెళ్లారు. ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీలతో కూడిన శిలాఫలకం ఏర్పాటు చేశారు. 97 అసెంబ్లీ నియోజకవర్గంల్లో 70 చోట్ల లోకేష్ బహిరంగ సభలు నిర్వహించారు. దాదాపు మూడున్నర లక్షల మందికిపైగా అభిమానులతో లోకేష్ సెల్ఫీ దిగారు. ఒకేరోజు 2500 మందితో సెల్ఫీలు దిగిన కారణంగా తీవ్రమైన చెయ్యి నొప్పితో బాధపడ్డారు. పెనమలూరు నియోజకవర్గంలో 13 గంటలపాటు ఏకధాటిగా లోకేష్ పాదయాత్ర కొనసాగింది. చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్ర ముగిసిన చోటే యవగళం పాదయాత్ర కూడా ముగుస్తుంది. బుధవారం విజయనగరం జిల్లా పోల్లపల్లిలో విజయోత్సవ సభ నిర్వహించనున్నారు.

ఈ వార్త కూడా చదవండి..

ఉమ్మడి జిల్లాల వారీగా యువగళం పాదయాత్ర వివరాలు:

1. చిత్తూరు – 14 నియోజకవర్గాలు – 45రోజులు – 577 కి.మీ.

2. అనంతపురం – 9 నియోజకవర్గాలు – 23రోజులు – 303 కి.మీ.

3. కర్నూలు – 14 నియోజకవర్గాలు – 40రోజులు – 507 కి.మీ.

4. కడప – 7 నియోజకవర్గాలు – 16రోజులు – 200 కి.మీ.

5. నెల్లూరు – 10 నియోజకవర్గాలు – 31రోజులు – 459 కి.మీ.

6. ప్రకాశం – 8 నియోజకవర్గాలు – 17రోజులు – 220 కి.మీ.

7. గుంటూరు – 7 నియోజకవర్గాలు – 16రోజులు – 236 కి.మీ.

8. కృష్ణా జిల్లా – 6 నియోజకవర్గాలు – 8రోజులు – 113 కి.మీ.లు

9. పశ్చిమగోదావరి – 8 నియోజకవర్గాలు – 11రోజులు – 225.5 కి.మీ.

10. తూర్పుగోదావరి – 9 నియోజకవర్గాలు – 12రోజులు – 178.5 కి.మీ.

11. విశాఖపట్నం జిల్లా – 5 నియోజకవర్గాలు – 7రోజులు – 113 కి.మీ.

మొత్తం – 97 నియోజకవర్గాలు – 226రోజులు – 3132 కి.మీ.

కాగా 226వరోజు సోమవారం ఉదయం నారా లోకేష్ యువగళం పాదయాత్ర గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మొత్తం దూరం 3119 కి.మీ. నడిచారు. యువగళం వివరాలు..

8.00 – విశాఖ సిడబ్ల్యుసి-1 క్యాంప్ సైట్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.45 – నెహ్రూ పార్కు వద్ద ఆర్మీ ఉద్యోగులతో సమావేశం.

9.00 – తెలుగుతల్లి విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ నిర్వాసితులతో భేటీ.

10.00 – దుర్గానగర్ బస్టాప్ వద్ద పద్మశాలి సామాజిక వర్గీయులతో ముఖాముఖి.

10.15 – వై.జంక్షన్‌లో యువనేతతో కలిసి శ్రామికుల అడుగులు.

10.30 – లయన్స్ క్లబ్ వద్ద గంగవరం పోర్టు డిపి ఉద్యోగులతో భేటీ.

10.35 – హనుమాన్ టెంపుల్ వద్ద స్థానికులతో మాటామంతీ.

10.40 – జగ్ జంక్షన్ వద్ద టూవీలర్ మెకానిక్‌లతో సమావేశం.

10.45 – కెనరా బ్యాంక్ వద్ద స్థానికులతో మాటామంతీ.

10.50 – చినగంట్యాడలో యువనేతతో కలిసి రైతుల అడుగులు.

11.05 – ఎస్ఎఫ్ఎస్ స్కూలు వద్ద హామాలీ వర్కర్లతో సమావేశం.

11.15 – హనుమాన్ కమ్యూనిటీ వద్ద జంగమ సామాజికవర్గీయులతో భేటీ.

11.20 – వంటిల్లు జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లతో సమావేశం.

11.30 – ఓల్డ్ గాజువాక జంక్షన్‌లో యువనేతతో యువత అడుగులు.

11.45 – సిఎంఆర్ జంక్షన్‌లో స్వర్ణకారులతో సమావేశం.

12.00 – ఆర్‌కె హాస్పటల్ వద్ద స్థానికులతో మాటామంతీ.

12.10 – పోలీస్ స్టేషన్ జంక్షన్‌లో తలసేమియా పేషెంట్లతో సమావేశం.

12.25 – టిఎస్ఆర్ అండ్ టిబికె కాలేజి వద్ద లాయర్లతో భేటీ.

12.30 – శ్రీనగర్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సమావేశం.

1.15 – వడ్లమూడి జంక్షన్‌లో భోజన విరామం.

2.00 – భోజన విరామస్థలంలో అగ్రిగోల్డ్ బాధితులు, మీసేవా నిర్వాహకులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – వడ్లమూడి జంక్షన్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

4.15 – కూర్మపాలెం జంక్షన్ లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ.

5.00 – గ్రేటర్ విశాఖ శివాజీనగర్ లో యువగళం పాదయాత్ర ముగింపు, పైలాన్ ఆవిష్కరణ.

Updated Date - Dec 18 , 2023 | 08:15 AM