Share News

యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Mar 19 , 2026 | 08:21 AM

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జాబ్ క్యాలెండర్‌ను కూటమి ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ: మంత్రి లోకేశ్

అమరావతి, మార్చి 19: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జాబ్ క్యాలెండర్‌ను కూటమి ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ వచ్చిందన్నారు. నిర్దేశిత సమయంలో పరీక్షలు నిర్వహించి పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటించారు. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి ఏటా ఉగాదికి ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన ఉంటుందని నిరుద్యోగ యువతకు ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.


తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాట్లు వివరించారు. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని తెలిపారు. ఇక మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలంటూ నిరుద్యోగ యువతకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఉద్యోగార్థులందరికీ ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.


2023, జనవరి 27వ తేదీ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట పాదయాత్రను చేపట్టారు. ఈ పాదయాత్రలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఆ సమయంలో ఇచ్చి హామీని కూటమి ప్రభుత్వం ఉగాది పండగ వేళ.. నెరవేర్చుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నిరుద్యోగులకు పండగ లాంటి వార్త చెప్పిన కూటమి ప్రభుత్వం

నేటి నుంచి భద్రాచలంలో రాముల వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు

For More AP News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 08:30 AM