నిరుద్యోగులకు పండగ లాంటి వార్త చెప్పిన కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Mar 19 , 2026 | 07:50 AM
శ్రీపరాభవ నామ సంవత్సరం ప్రారంభ వేళ.. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 10 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
అమరావతి, మార్చి 19: తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం వేళ.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రాబోయే 7 నెలల్లో 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం వివరించింది. మే మాసంలో ఉన్నత విద్యా శాఖలో 1,500 ఉద్యోగాలు, ఆగస్టులో హోం శాఖలో 2,778, ఇతర శాఖల్లో 928 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సెప్టెంబర్‌లో గ్రూప్-2 పరీక్ష ద్వారా 750 పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొంది.
ఇంజనీరింగ్ విభాగంలో 503, ఇతర శాఖల్లో 506 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇక అక్టోబర్‌లో పాఠశాల, ఇంటర్మీడియట్ బోర్డులతో కలిపి 3,004 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం గణాంకాలతో సహా వివరించింది. 2023లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరటి పాదయాత్ర చేపట్టారు. తాము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఈ సందర్భంగా యువతకు ఆయన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఉగాది పండగ వేళ.. జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు
నేటి నుంచి భద్రాచలంలో రాముల వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు
For More AP News And Telugu News