త్వరలో విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:16 AM
విశాఖపట్నంలోని ముడసర్లోవలో దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు
న్యూఢిల్లీ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని ముడసర్లోవలో దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. బుధవారం లోక్‌సభలో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణాన్నిరూ.106.89 కోట్లతో చేపట్టినట్టు చెప్పారు. జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నియామకాలు పూర్తయ్యాయని, కంట్రోల్ ఆఫీ్‌స కూడా ఏర్పాటు చేశామన్నారు.