నేటి నుంచి భద్రాచలంలో రాముల వారి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 07:25 AM
భద్రాచలంలో కొలువుదీరిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ఆలయంలో గురువారం నుంచి వసంత పక్ష తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అభిషేకం, ఆరాధన, తిరుమంజన సేవలను ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు.
భద్రాచలం, మార్చి 19: భద్రాచలంలో కొలువుదీరిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ఆలయంలో గురువారం నుంచి వసంత పక్ష తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అభిషేకం, ఆరాధన, తిరుమంజన సేవలను ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రం స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. స్థానిక తాత గుడి సెంటర్ వద్దనున్న ఆలయంలో భూమి పూజ, వాస్తు పూజ నిర్వహించి ఈ తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. అనంతరం ఉగాది ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు.
మార్చి 27వ తేదీ శ్రీరామ నవమి సందర్భంగా శ్రీసీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. అలాగే మార్చి 28న శ్రీ రామ మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న బ్రహ్మోత్సవాలు.. ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీ వరకు దేవాలయంలో నిర్వహించే నిత్య కళ్యాణాలను నిలిపివేయనున్నారు. ఈ మేరకు ఆలయ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. పక్క రాష్ట్రాల నుంచి సైతం భారీగా భక్తులు భద్రాచలంకు తరలి రానున్నారు. దాంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ, స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు
For More TG News And Telugu News