16 మంది ఐపీఎస్‌లకు అవార్డులు
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:18 AM
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 16మంది ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ అవార్డులు ప్రకటించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్‌చంద్ర లడ్డా, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్...
ఆరుగురికి ‘అతి ఉత్కృష్ట’.. పదిమందికి ’ఉత్కృష్ట’
అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 16మంది ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ అవార్డులు ప్రకటించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్‌చంద్ర లడ్డా, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్, పోలీసు పర్సనల్ విభాగం ఐజీ హరికృష్ణ, పీఅండ్‌ఎల్ ఐజీ రవిప్రకాశ్, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబుకు ‘అతి ఉత్కృష్ట’ పురస్కారాలకు ఎంపియ్యారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మి, విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, ఆక్టోపస్ ఐజీ సెంథిల్ కుమార్, అనంతపురం రేంజ్ ఐజీ షేముషి, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్, ఇంటెలిజెన్స్ ఎస్పీ గీతాదేవికి ‘ఉత్కృష్ట’ అవార్డులు లభించాయి. ఐపీఎస్ అధికారి మొదలుకొని కానిస్టేబుల్ వరకూ రాష్ట్రానికి చెందిన 353 మందికి అతి ఉత్కృష్ట సేవా పతకాలు, మరో 607 మందికి ఉత్కృష్ట సేవా పతకాలు దక్కాయి.
610 మందికి సేవా పతకాలు
తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 610 మంది పోలీసు, ఇతర యూనిఫామ్ సర్వీసులకు సేవా పతకాలు ప్రకటించింది. 38 మందికి ముఖ్యమంత్రి శౌర్య పతకాలు, ఏడుగురికి మహోన్నత సేవా పతకాలు, 72 మందికి ఉత్తమ సేవా పతకాలు, 60 మందికి కఠిన సేవా పతకాలు, 318 మందికి సేవా పతకాలు లభించాయి. అగ్నిమాపక శాఖలో ఆరుగురికి ఉత్తమ సేవా, 50 మందికి సేవా పతకాలు ప్రకటించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో ఇద్దరికి మహోన్నత సేవా, ఐదుగురికి ఉత్తమ సేవా, 20 మందికి సేవా పతకాలు, ఎస్‌పీఎఫ్ విభాగంలో ఆరుగురికి ఉత్తమ సేవా, 26 మందికి సేవా పతకాలు ప్రకటించింది. జాబితాను రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ విడుదల చేశారు.