Share News

టీడీపీలో ఎన్నో సంస్కరణలకు లోకేశ్ శ్రీకారం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:55 PM

ఓ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేశ్ అన్ని విధాలా టీడీపీని ముందుకు నడిపిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు ఎన్నో కీలక సంస్కరణలకు యువనేత శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు.

టీడీపీలో ఎన్నో సంస్కరణలకు లోకేశ్ శ్రీకారం: మంత్రి గొట్టిపాటి రవికుమార్
Minister Gottipati Ravikumar

అమరావతి, ఏప్రిల్ 16: పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేసిన నాయకుడు లోకేశ్ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati Ravikumar) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రం బాగు కోసం ఎక్కడా వెనుకడుగు వేయలేదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒంగోలు మహానాడు నిర్వహణ సహా పార్టీ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా చూడటం లోకేశ్ కోఆర్డినేషన్ వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చారు.


ఓ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేశ్ అన్ని విధాలా టీడీపీని ముందుకు నడిపిస్తున్నారని మంత్రి కొనియాడారు. కార్యకర్తల సంక్షేమ నిధితో పాటు ఎన్నో కీలక సంస్కరణలకు యువనేత శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇన్సూరెన్స్ పాలసీ కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కోటి మంది సభ్యులతో పార్టీని బలోపేతం చేయటం లోకేశ్ క్రెడిట్ అని మంత్రి అన్నారు. కష్టపడే వారికి తగిన గుర్తింపు ఇస్తూ అహర్నిశలు ప్రజల బాగు కోసం పరితపిస్తున్నారని చెప్పారు. మంత్రిగానూ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పెట్టుబడుల స్థాపనకు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యా విధానంలో లోకేశ్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఆ విషయాల్లో మహిళల పాత్రకు ప్రత్యామ్నాయం లేదు: పవన్ కల్యాణ్

జగన్‌కు ఉన్న ప్రేమ ఒక్కటే గొడ్డలి పార్టీ.. గొడ్డలి గుర్తు: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 16 , 2026 | 02:01 PM