Share News

జగన్‌కు ఉన్న ప్రేమ ఒక్కటే గొడ్డలి పార్టీ.. గొడ్డలి గుర్తు: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:22 PM

ఐదేళ్లు నిధులు, బిల్లులు ఇవ్వకుండా జువ్వలదిన్నె హార్బర్‌ను అడ్డుకొని మత్స్యకారుల పొట్ట కొట్టిన వ్యక్తి జగన్ అంటూ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ఫిషింగ్ హార్బర్‌లలో ఎస్టిమేట్‌లు పెంచి కమీషన్‌లు కొట్టేశారని ఆరోపించారు.

జగన్‌కు ఉన్న ప్రేమ ఒక్కటే గొడ్డలి పార్టీ.. గొడ్డలి గుర్తు: మంత్రి కొల్లు రవీంద్ర
Kollu Ravindra

అమరావతి, ఏప్రిల్ 16: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ బతుకే ఒక అరాచకమని విమర్శించారు. ఐదేళ్లు నిధులు, బిల్లులు ఇవ్వకుండా జువ్వలదిన్నె హార్బర్‌ను అడ్డుకొని మత్స్యకారుల పొట్ట కొట్టిన వ్యక్తి జగన్ అంటూ వ్యాఖ్యానించారు. ఫిషింగ్ హార్బర్‌లలో ఎస్టిమేట్‌లు పెంచి కమీషన్‌లు కొట్టేశారని ఆరోపించారు. తాము శరవేగంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌లను నిర్మిస్తున్నామని.. పూర్తి మౌలిక సదుపాయాలతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను పూర్తి చేస్తున్నామని మంత్రి చెప్పారు.


మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బకొట్టేలా జగన్ తెచ్చిన జీవో నెం.217ను రద్దు చేసి ఆదుకున్నామని మంత్రి వెల్లడించారు. స్పీడ్ బోట్‌ల ద్వారా తమిళనాడు బోట్లను పట్టుకుంటే దానిపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తల్లి, చెల్లి అంటే ప్రేమ లేక తరిమేశారని.. ఇప్పుడు అభివృద్ధి అంటే ఇష్టం లేక పెట్టుబడులను తరిమేస్తా అంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రక్షణపై అవగాహన ఉంటే సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థను తరిమేస్తా అని జగన్ అనలేరన్నారు. జగన్‌కు ఉన్న ప్రేమ ఒక్కటే గొడ్డలి పార్టీ.. గొడ్డలి గుర్తు అంటూ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి...

జనంలో ఉండాలి.. జనం కోసం పనిచేయాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ఆ విషయాల్లో మహిళల పాత్రకు ప్రత్యామ్నాయం లేదు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 16 , 2026 | 01:28 PM