Share News

పవనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Apr 16 , 2026 | 10:58 AM

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన లోకేశ్‌కు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై ఎక్స్‌ వేదికగా లోకేశ్ స్పందించారు.

పవనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు: మంత్రి లోకేశ్
Nara Lokesh

అమరావతి, ఏప్రిల్ 16: టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన నారా లోకేశ్‌కు(Minister Nara Lokesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. పవన్ విషెస్‌పై మంత్రి లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌‌ వేదికగా స్పందించారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన పవనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు. తమ్ముడిగా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.


లోకేశ్ ట్వీట్...

‘తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన నన్ను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేసిన ఉప ముఖ్యమంత్రి పవనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులతో, మీ ఆకాంక్ష మేరకు కూటమి స్ఫూర్తి మరింత స్నేహపూర్వకంగా.. సమన్వయంతో, రాష్ట్ర ప్రగతి -ప్రజా సంక్షేమం లక్ష్యంగా కొనసాగుతుంది. తమ్ముడిగా నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. సోదరుడిగా మీరు చూపిస్తున్న అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


లోకేశ్‌కు అభినందనలు: పవన్ కల్యాణ్

‘తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సహచర మంత్రి, సోదరుడు నారా లోకేశ్‌కు హృదయపూర్వక అభినందనలు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన లోకేశ్ కొత్త బాధ్యతలలో సఫలీకృతులు కావాలని, కూటమి స్ఫూర్తిని సమర్థంగా కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నాను. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన పల్లా శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

కులాల గుట్టు విప్పిన రేవంత్‌ సర్కారు

ఏపీ ఇంటర్ బోర్డు అధికారులకు విద్యార్థి ఫోన్.. ఏం చెప్పాడంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 16 , 2026 | 11:28 AM