ఏపీ ఇంటర్ బోర్డు అధికారులకు విద్యార్థి ఫోన్.. ఏం చెప్పాడంటే
ABN , Publish Date - Apr 16 , 2026 | 09:53 AM
తనను పాస్ చేయాలంటూ ఏపీ ఇంటర్ బోర్డు అధికారులకు ఓ విద్యార్థి ఫోన్ చేశాడు. తాను ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశానని, ఏమీ చదవకపోవడంతో ప్రశ్నా పత్రాన్నే మూడు సార్లు రాసినట్లు తెలిపాడు.
విశాఖపట్నం, ఏప్రిల్ 16: ఏపీలో ఇంటర్ ఫలితాలు నిన్న(బుధవారం) విడుదలయ్యాయి. ఈసారి అత్యధికంగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలకు ముందు విద్యార్థులు టెన్షన్ పడటం కామన్. తమకు ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తామో అని ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే విశాఖకు చెందిన ఓ విద్యార్థి మాత్రం పరీక్షల్లో పెయిల్ అవుతానేమో అని భయపడి.. అతడు చేసిన ఓ పని ఇప్పుడు సంచలనంగా మారింది. ఫలితాలు వెల్లడికాక ముందే ఆ విద్యార్థి.. ఇంటర్ బోర్డు అధికారులకు ఫోన్ చేసి తనను పాస్ చేయాలంటూ కోరాడు. తాను ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశానని, ఏమీ చదవకపోవడంతో ప్రశ్నా పత్రాన్నే మూడు సార్లు రాసినట్లు తెలిపాడు.
జవాబు పత్రంలో డబ్బు కూడా పెట్టానని, తనను ఏదో విధంగా పాస్ చేయాలని అధికారులను కోరాడు. దీనిపై స్పందించిన అధికారులు.. విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వలోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాబోతున్నాయని, బాగా చదువుకుని పరీక్షలు రాయాలని విద్యార్థికి అధికారులు సూచించారు. ఈ విషయాన్ని విశాఖ ఆర్‌ఐవోకు సమాచారం ఇచ్చి.. విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయాల్సిందిగా తెలిపారు. వెంటనే జిల్లా అధికారులు ఆ విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడగా.. తాము జాగ్రత్తగా చూసుకుంటామని వారు చెప్పారు. అయితే.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన విద్యార్థి.. ఫస్ట్ ఇయర్‌లో రెండు సబ్జెక్టులు, సెకండియర్‌లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు.
ఇవి కూడా చదవండి...
స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్.. కాకినాడ తరలింపు
కులాల గుట్టు విప్పిన రేవంత్ సర్కారు
Read Latest AP News And Telugu News