స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్.. కాకినాడ తరలింపు
ABN , Publish Date - Apr 16 , 2026 | 07:35 AM
సినీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాకినాడ, ఏప్రిల్ 16: సినీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాకినాడకు తరలించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు సినీ ప్రముఖలపై అనుదీప్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. వీడియోలు విడుదల చేశాడు. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి బి. వెంకటకృష్ణ కాకినాడలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో అనుదీప్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో వైపు రెండు రోజుల క్రితం తన వ్యాఖ్యల పట్ల చింతిస్తూ.. క్షమాపణలు కోరుతూ అనుదీప్ ఒక వీడియో విడుదల చేశాడు. అనంతరం అతను అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అతని సెల్ ఫోన్‌ను ట్రాక్ చేసిన పోలీసులు.. అనుదీప్ ప్రయాగ్ రాజ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ప్రయాగ్ రాజ్ చేరుకున్న కాకినాడ పోలీసులు.. అనుదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
For More AP News And Telugu News