కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
ABN , Publish Date - Apr 16 , 2026 | 06:49 AM
కర్నూల్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
మంత్రాలయం, ఏప్రిల్ 16: కర్నూల్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
మృతులు అమృత, తేజస్వని, ధన్య, దీపక్, దీక్షిత, ప్రతాప్, కుమార్‌గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వీరంతా కర్నాటక రాష్ట్రం చిక్‌మంగళూరు జిల్లా కనకాయహల్లి గ్రామానికి చెందినవారని, ఇప్పటికే కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంత్రాలయం పుణ్యక్షేత్రం సందర్శనకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం బాధితుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
Also Read:
మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం
ఎస్ఆర్‌హెచ్‌కు క్రేజీ న్యూస్.. జట్టులో చేరనున్న ప్యాట్ కమిన్స్!
For More Latest News