ఎస్ఆర్‌హెచ్‌కు క్రేజీ న్యూస్.. జట్టులో చేరనున్న ప్యాట్ కమిన్స్!
ABN , Publish Date - Apr 14 , 2026 | 07:47 PM
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులకు ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ బౌలర్, ఎస్ఆర్‌హెచ్ కీలక ప్లేయర్ ప్యాట్ కమిన్స్ ఏప్రిల్ 17న తిరిగి జట్టుతో చేరనున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులకు ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ బౌలర్, ఎస్ఆర్‌హెచ్ కీలక ప్లేయర్ ప్యాట్ కమిన్స్ ఏప్రిల్ 17న తిరిగి జట్టుతో చేరనున్నట్లు సమాచారం. అయితే ఈ సీజన్‌లో అజేయంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను సొంత మైదానంలో హైదరాబాద్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అరంగేట్ర బౌలర్లు ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ మెరుపులకు ప్యాట్ కమిన్స్ రాకతో మరింత బలం చేకూరనుంది.
గాయం కారణంగా కమిన్స్ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇంకా అడుగుపెట్టలేదు. బుధవారం ఆస్ట్రేలియాలో అతడికి ఫిట్‌నెస్ పరీక్ష జరగనుంది. అందులో నెగ్గితే హైదరాబాద్ జట్టుతో చేరడం ఖాయం. ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైనప్పటికీ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కమిన్స్ కెప్టెన్సీలో 2024లో ఎస్ఆర్‌హెచ్ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. అయితే కమిన్స్ గైర్హాజరీలో జట్టును యువ ప్లేయర్ ఇషాన్ కిషన్ నడిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ జట్టు.. రెండింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌పై ఏకంగా 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అరంగేట్రంలో ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ చెరో నాలుగు వికెట్లు తీసి అదరగొట్టారు.
ఇవి కూడా చదవండి:
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వల్లే ముంబైకి వరుస ఓటములు.. టీమిండియా మాజీ ప్లేయర్
కోహ్లీ తన స్థాయికి తగిన ప్రదర్శన చేయడం లేదు: మాజీ క్రికెటర్