Share News

కొవిడ్ వ్యాక్సిన్ వల్లే మరణించారు.. షేన్ వార్న్ కుమారుడి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:26 PM

ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. 2022లో వార్న్ థాయ్‌లాండ్‌లో గుండేపోటుతో కన్నుమూశారు. ఆయన మృతిపై నాలుగేళ్ల తర్వాత ఆయన కుమారుడు జాక్సన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొవిడ్ వ్యాక్సిన్ వల్లే మరణించారు.. షేన్ వార్న్ కుమారుడి సంచలన వ్యాఖ్యలు
Shane Warne

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. 2022లో వార్న్ థాయ్‌లాండ్‌లో గుండేపోటుతో కన్నుమూశారు. ఆయన మృతిపై నాలుగేళ్ల తర్వాత ఆయన కుమారుడు జాక్సన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ వల్లే షేన్ వార్న్ మృతి చెందడాని ఓ పాడ్‌కాస్ట్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.


‘నాన్నకు నాలుగు డోసుల కొవిడ్ టీకాలు ఇవ్వాల్సి వచ్చింది. అవి తీసుకోవడం ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో టీకాలు వేపించుకున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వల్లే ఆయన మరణించారేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. ఆ వ్యాక్సిన్ ప్రభావం నాన్న ఆరోగ్యంపై పడింది. అయితే ఆయనకు అంతర్గతంగా కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన మద్యం తాగేవారు, స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. అవే అలవాట్లు ఉన్న చాలామంది ఇంకా ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఆ సమయంలో నాన్న ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. నాన్న మరణ వార్త విన్న తర్వాత ప్రభుత్వం, కొవిడ్ పరిస్థితులపై కోపం వచ్చింది’ అని జాక్సన్ వార్న్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వల్లే ముంబైకి వరుస ఓటములు.. టీమిండియా మాజీ ప్లేయర్

కోహ్లీ తన స్థాయికి తగిన ప్రదర్శన చేయడం లేదు: మాజీ క్రికెటర్

Updated Date - Apr 14 , 2026 | 07:03 PM