Share News

ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌కు గుడ్‌బై.. ముజరబానిపై రెండేళ్ల నిషేధం విధించిన పీసీబీ

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:24 PM

జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని ఐపీఎల్ 2026లో ఆడేందుకు పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను మధ్యలోనే వదిలేసి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అతడిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. ముజరబానిపై రెండేళ్ల నిషేధం విధిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌కు గుడ్‌బై.. ముజరబానిపై రెండేళ్ల నిషేధం విధించిన పీసీబీ
Blessing Muzarabani

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాంచైజీ లీగ్‌ల మధ్య పోటీ మరోసారి చర్చనీయాంశమైంది. జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని ఐపీఎల్ 2026లో ఆడేందుకు పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను మధ్యలోనే వదిలేసి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అతడిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. ముజరబానిపై రెండేళ్ల నిషేధం విధిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.


తొలుత ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ముజరబానిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలాడు. దీంతో పీఎస్ఎల్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే భారత్-బంగ్లా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ‌మాన్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు ఐపీఎల్ నుంచి కేకేఆర్ తప్పించిన సంగతి తెలిసిందే. రెహమాన్ స్థానంలో ముజరాబానిని కేకేఆర్ తీసుకుంది. దీంతో అతడు పీఎస్ఎల్‌ను వదిలి ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టులో వచ్చి చేరాడు. ఈ నిర్ణయం పీఎస్ఎల్ నిబంధనలకు విరుద్ధమని భావించి పీసీబీ కఠినంగా స్పందించింది.


ముజరబాని స్థానంలో ముస్తాఫిజుర్..

ముజరబాని పీఎస్ఎల్‌ను వీడటంతో ఇస్లామాబాద్ జట్టు అతడి స్థానంలో తిరిగి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తీసుకుంది. గతంలో సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ కార్బిన్ బోష్ కూడా పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్‌కు వచ్చాడు. అతడిపై ఏడాది నిషేధం మాత్రమే పడింది. కానీ ముజరబానికి రెండేళ్ల నిషేధం విధించడం గమనార్హం. ఇక మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఉన్నట్టుండి పీఎస్ఎల్‌ను వీడారు. జాన్సెన్, శనక పీఎస్ఎల్ ఒప్పందాల నుంచి తప్పుకుని ఐపీఎల్‌లో పాల్గొన్నారు. వీరిపై కూడా ఇలాంటి చర్యలు ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి:

హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వల్లే ముంబైకి వరుస ఓటములు.. టీమిండియా మాజీ ప్లేయర్

కోహ్లీ తన స్థాయికి తగిన ప్రదర్శన చేయడం లేదు: మాజీ క్రికెటర్

Updated Date - Apr 14 , 2026 | 05:50 PM