Share News

ఐపీఎల్ 2026: సీఎస్కేతో మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్

ABN , Publish Date - Apr 14 , 2026 | 07:15 PM

ఐపీఎల్ 2026లో భాగంగా నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్ చేయనుంది.

ఐపీఎల్ 2026: సీఎస్కేతో మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్
CSK vs KKR

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ ఇరుజట్లూ పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో ఉండటం గమనార్హం. గత మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ సెంచరీ చేయడంతో సీఎస్కే తొలి గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. అదే ఊపుతో మరో విజయాన్ని నమోదు చేయాలన్న పట్టుదలతో బరిలోకి దిగనుంది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్‌లో ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. ఈ మ్యాచ్‌లోనైనా కేకేఆర్ బోణీ కొడుతుందేమో చూడాలి.


సీఎస్కే తుది జట్టు

సంజు శాంసన్(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబె, డేవాల్డ్ బ్రెవిస్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జాప్‌నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: మ్యాథ్యూ షాట్, అకీల్ హుస్సేన్, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్, మ్యాట్ హెన్రీ


కేకేఆర్ తుది జట్టు

అజింక్య రహానె(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), పొవెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: ఫిన్ అలెన్, మనిశ్ పాండే, తేజస్వి దాహియా, టిమ్ సీఫర్ట్, నవదీప్ సైనీ


ఇవి కూడా చదవండి:

హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వల్లే ముంబైకి వరుస ఓటములు.. టీమిండియా మాజీ ప్లేయర్

కోహ్లీ తన స్థాయికి తగిన ప్రదర్శన చేయడం లేదు: మాజీ క్రికెటర్

Updated Date - Apr 14 , 2026 | 07:48 PM