కందుకూరి వీరేశలింగం పంతులుకు సీఎం చంద్రబాబు ఘన నివాళి
ABN , Publish Date - Apr 16 , 2026 | 09:54 AM
ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. జాతి కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
అమరావతి, ఏప్రిల్ 16: ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. జాతి కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
గురువారం తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ‘సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి 178 వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. స్త్రీ విద్య కోసం ఉద్యమించిన మహనీయుడు ఆయన. ఆనాటి దురాచారం అయిన బాల్య వివాహాలను ఖండించి, వితంతు వివాహాలు ప్రోత్సహించిన ధీశాలి. ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఘననివాళి అర్పిస్తున్నాను. అని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భూవివాదం.. గొంతు కోసి దారుణ హత్య
For More AP News And Telugu News