ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP MP: ‘అంబానీని విమర్శించే స్థాయా నీది.. లోకేష్ నీ స్థాయి ఏంటి?’

ABN, First Publish Date - 2023-03-07T13:10:25+05:30

టీడీపీ నేత నారా లోకేష్‌పై ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూడిల్లీ: టీడీపీ నేత నారా లోకేష్‌ (TDP Leader Nara lokesh)పై ఎంపీ మార్గాని భరత్ (MP Margani Bharath) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియతో మాట్లాడుతూ.. విశాఖలో పెద్ద ఎత్తున్న ఇన్వెస్టర్ సమ్మిట్ (Visakha Global investors Summit) జరిగిందని... 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయన్నారు. లీడర్ షిప్‌పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టారని అన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో ఏ సమస్య వచ్చినా తీరుస్తామని సీఎం చెప్పారన్నారు. అయితే కడుపు మంటతో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బురదజల్లుతోందని మండిపడ్డారు. జగన్‌మోహన్ రెడ్డి (YS jaganmohan Reddy) ముందు లోకేష్ (TDP Leader Nara Lokesh) ఒక బచ్చా అని వ్యాఖ్యలు చేశారు. ముకేష్ అంబానీ (Mukesh Ambani) ని విమర్శించే స్థాయి లోకేష్ దా... లోకేష్ స్థాయి ఏంటి అని ప్రశ్నించారు. తెలుగు డ్రామా పార్టీ కొంతమందిని ఏర్పాటు చేసి డ్రామా చేస్తోందని వైసీపీ ఎంపీ (YCP MP) యెద్దేవా చేశారు.

ఇండస్ట్రీకి ఇంతమంది పెద్దలు వస్తే లోకల్ అంటారా అని అన్నారు. లోకేష్ ముఖ్యమంత్రితో పోల్చుకుంటున్నారన్నారు. లోకేష్ మూడు శాఖలకు మంత్రిని చేశాను అంటున్నారని... కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని దుయ్యబట్టారు. జగన్ ఒక పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రిగా గెలిచారని... జగన్‌ను ప్రజలు స్వాగతించారని తెలిపారు. కియా (KIA)ను చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) తీసుకురాలేదని.. కేంద్రం (Central Government) సిఫార్సు చేస్తే రాష్టాని (Andhrapradesh) కి వచ్చారని... అందులో తమ పాత్ర ఏమీ లేదన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వారికి చెంపపెట్టు సమాధానం ఇవ్వాలని అన్నారు. ఏపీ (AP) గ్రోత్ రేటు 11.4శాతం ఉందన్నారు. ప్రతిపనిని తప్పు పట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ (Polavaram Project) అని... టీడీపీ హయాంలో కాంట్రాక్ట్‌కు కక్కుర్తిపడి తాము చేస్తామని చంద్రబాబు అన్నారని తెలిపారు. కమిషన్ కొట్టేయాలనే కక్కుర్తితో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారని ఎంపీ మార్గాని భరత్ విమర్శలు గుప్పించారు. .

Updated Date - 2023-03-07T13:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising