ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jogi Ramesh: నారా లోకేష్, టీడీపీ నేతలపై మంత్రి జోగి రమేష్ విమర్శలు

ABN, First Publish Date - 2023-08-25T14:10:57+05:30

కుక్కలు మొరిగినట్లు టీడీపీ నేతలు మొరుగుతున్నారు. కర్రలు తీసుకుంటే కుక్కలు పారిపోయినట్లు టీడీపీ నేతలు పారిపోతున్నారు. నేను నీ ఇంటికే వచ్చా మీ నాన్న పారిపోయాడు. జగన్ మోహన్ రెడ్డిని తిట్టడం, ప్రభుత్వంపై నిందలు వేయడం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు.

విజయవాడ: నారా లోకేష్‌ (Nara Lokesh), యువగళం పాదయాత్రపై మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడుతూ మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కుక్కలు మొరిగినట్లు టీడీపీ నేతలు మొరుగుతున్నారు. కర్రలు తీసుకుంటే కుక్కలు పారిపోయినట్లు టీడీపీ నేతలు పారిపోతున్నారు. నేను నీ ఇంటికే వచ్చా మీ నాన్న పారిపోయాడు. జగన్ మోహన్ రెడ్డిని తిట్టడం, ప్రభుత్వంపై నిందలు వేయడం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. గన్నవరం సభ ప్రభుత్వాన్ని తిట్టడం కోసమే పెట్టినట్లు ఉంది. మీ అయ్యనే ఉరికించాం.. నువ్వు ఎంత లోకేష్. లోకేష్ నోరు అదుపులో పెట్టుకో. పాదయాత్ర అంటే ఏంటో వైఎస్ఆర్, వైఎస్ జగన్‌ని చూసి నేర్చుకో. నడవలేని వృద్ధులు సైతం జగన్ పాదయాత్రకు వచ్చారు. బౌన్సర్స్‌ని పెట్టుకుని చేయడం కాదు యాత్ర అంటే. పాదయాత్ర అంటే పేటెంట్ వైఎస్ఆర్, జగన్‌కు మాత్రమే ఉంది. నేను చంద్రబాబు ఇంటికే వెళ్లాను.. నువ్వు టైం చెప్పు.. ప్లేస్ చెప్పు మళ్లీ నీ దగ్గరకు వస్తాం. వారాహి యాత్ర చేసినా, పాదయాత్ర చేసినా మీరు మళ్లీ అధికారంలోకి రారు.’’ అంటూ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-08-25T14:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising