TD Janardhan: జగన్ దిగిపోయే ముందు పెట్టుబడుల సదస్సు ఎందుకు?
ABN, First Publish Date - 2023-03-04T14:19:39+05:30
సీఎం జగన్‌కి (CM JAGAN) గుణపాఠం చెప్పడానికి గ్రాడ్యుయేట్స్ సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం (TDP) ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ టీ.డీ జనార్దన్
అమరావతి: సీఎం జగన్‌కి (CM JAGAN) గుణపాఠం చెప్పడానికి గ్రాడ్యుయేట్స్ సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం (TDP) ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ టీ.డీ జనార్దన్ (TD Janardhan) వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు టీడీపీ గెలుస్తుంది. మూడు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి... టీడీపీ గెలుపు రెండు ఖాయం. వైసీపీకి (YCP) దొంగ ఓట్లు వేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఈసారి ఎన్నికల కమిషన్ (EC) కూడా వైసీపీ దొంగ ఓట్లను అడ్డుకోవాలి. గ్రాడ్యుయేట్స్ ఓటర్లు (Graduates voters) అందరూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కరిని టీడీపీ నేతలు కలుస్తున్నారు. జగన్ (JAGAN) ఎన్నికలకు ముందు నమ్మించారు.. తర్వాత మోసం చేశారు. విశాఖకు (Visakhapatnam) వచ్చిన డెలిగేషన్‌కి సరిగా భోజన వసతి ప్రభుత్వం కల్పించలేదు. జగన్ దిగిపోయే ముందు పెట్టుబడుల సదస్సు (Investment conference) ఎందుకు?.’’ అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. పక్కింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఓ వ్యక్తి వింత నిర్వాకం..!
Updated Date - 2023-03-04T14:24:05+05:30 IST