షాకింగ్ ఘటన.. పక్కింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఓ వ్యక్తి వింత నిర్వాకం..!

ABN , First Publish Date - 2023-03-03T15:00:03+05:30 IST

పెళ్లి.. ప్రతి ఇంట్లో జరిగే ఒక శుభకార్యం. దీన్ని ఒక మహోత్సవంగా జరుపుకుంటారు. బంధువుల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని, ఇరుగు పొరుగువారిని, అందర్నీ పిలుచుకుంటారు. పేదోడైనా... ధనవంతుడైనా

షాకింగ్ ఘటన.. పక్కింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఓ వ్యక్తి వింత నిర్వాకం..!
వింత నిర్వాకం..!

పెళ్లి.. ప్రతి ఇంట్లో జరిగే ఒక శుభకార్యం. దీన్ని ఒక మహోత్సవంగా జరుపుకుంటారు. బంధువుల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని, ఇరుగు పొరుగువారిని, అందర్నీ పిలుచుకుంటారు. పేదోడైనా... ధనవంతుడైనా తమ సామర్థ్యం మేరకు సంతోషంగా జరుపుకునే కార్యక్రమం ఏదైనా ఉందంటే అది పెళ్లొక్కటే. అయితే కొన్ని సార్లు వివాహ పత్రిక అందొచ్చు.. అందకపోవచ్చు. అంతమాత్రాన నామోషిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. పిలవడం అనేది పిలిచేవారి ఇష్ట.. ఇష్టాలను బట్టి ఉంటుంది. దీన్ని అవమానంగా భావించాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అయితే స్టోరీ చదవాల్సిందే.

కొన్నిసార్లు ఆవేశం పనికి రాదంటారు పెద్దలు. కొన్ని సంఘటనలను బట్టి ఇది నిజమని నమ్మక తప్పదు. పొరుగింటి వాళ్లు పెళ్లికి పిలవలేదని ఏకంగా ఓ కుర్రాడు ఆవమానంగా భావించి పెళ్లింటి వారిపైనే రాళ్లు రువ్వాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పెళ్లి కొడుకు.. మరో స్నేహితుడితో కలిసి ప్రాణాలు తీశాడు. శుభకార్యంతో సంతోషంగా ఉండాల్సిన వరుడు కటకటాల పాలై.. జీవిత భాగస్వామికి కన్నీటిని మిగిల్చాడు. ఈ దారుణ ఘటన కేరళ (Kerala) లోని కొట్టాయం జిల్లా కరుకచల్‌లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: పాపం.. ఈ 21 ఏళ్ల యువతికి ఎంత కష్టమొచ్చింది..? కేన్సర్ ట్రీట్మెంట్ కోసం నగ్న చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టి మరీ..

సెబాస్టియన్‌ (Sebastian) అనే యువకుడికి ఇటీవలే వివాహమైంది (wedding). అయితే ఈ పెళ్లికి పొరుగునే ఉండే బిను(36) అనే యువకుడిని ఆహ్వానించకపోవడంతో అతడు తీవ్ర అవమానంగా భావించాడు. ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న బిను.. పెళ్లి కొడుకు ఇంటిపై రాళ్లు విసిరాడు (stone at house). అయితే ఈ విషయాన్ని సెబాస్టియన్ సీరియస్‌గా తీసుకున్నాడు. దీంతో మరో వ్యక్తి విష్ణుతో కలిసి అతడిపై దాడికి ప్లాన్ వేసుకున్నాడు. అంతే ఆదివారం రాత్రి మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బిను ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలా ఉంటే విష్ణుకు గతంలోనే బినుపై పాత కక్షలు ఉన్నాయి. విష్ణుకు బినుపై వైరం ఉందన్న సంగతి గమనించిన సెబాస్టియన్‌ ఈ హత్యకు ప్లాన్ వేశారు. బినును చంపిన అనంతరం నిందితులిద్దరూ ఆయుధాలతోనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. శుభకార్యం జరిగిన ఇంట్లో భార్యతో సంతోషంగా ఉండాల్సిన సెబాస్టియన్.. హంతకుడిగా కటకటాల్లో జైల్లో ఊచలు లెక్కపెడుతుంటే.. నవ వధువుకు మాత్రం కన్నీరు మిగిలింది.

ఇది కూడా చదవండి: Car Smoke: కారులోంచి వచ్చే పొగ నీలి రంగులోకి మారితే అర్థమేంటి..? తెలుపు, నలుపు రంగుల్లో కనిపిస్తే..

Updated Date - 2023-03-03T15:00:03+05:30 IST