ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kalavenkatarao: గుజరాత్, ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీట్లు అమ్ముకుంది వైసీపీనే

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:25 PM

తెలుగుదేశం పార్టీ ( TDP ) ఒక్క బీసీకి కూడా రాజ్యసభ ఇవ్వలేదని మంత్రి, తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ( Karumuri Venkata Nageswara Rao ) మాట్లాడడం అతని దిగజారుడుతనానికి నిదర్శనమని కిమిడి కళావెంకట్రావు ( Kimidi Kalavenkatarao ) పేర్కొన్నారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ ( TDP ) ఒక్క బీసీకి కూడా రాజ్యసభ ఇవ్వలేదని మంత్రి, తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ( Karumuri Venkata Nageswara Rao ) మాట్లాడడం అతని దిగజారుడుతనానికి నిదర్శనమని కిమిడి కళావెంకట్రావు ( Kimidi Kalavenkatarao ) పేర్కొన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ తెలుగుదేశం పార్టీ రుమాళ్ల రామచంద్రయ్య, గుండు సుధారాణి. అల్లాడి రాజకుమారి, దేవేందర్‌గౌడ్, ప్రొ.లక్ష్మన్న, జయప్రధ, జి. రామచంద్రయ్య, కెంబూరి రామ్మోహనరావు, కళా వెంకట్రావు లాంటి 8 మంది సామాన్య బీసీలకు రాజ్యసభ సీట్లు ఇచ్చింది. వైసీపీ అధ్యక్షుడిది అబద్దాల బతుకు....అందులో ఉన్న మంత్రులది అబద్దాల బతుకే. అబద్దాలతో ఎంతకాలం రాజకీయాలు చేస్తారు? గుజరాత్, ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీట్లు అమ్ముకుంది వైసీపీ కాదా... ? తెలుగుదేశం పార్టీ సామాన్య బీసీలను రాజ్యసభకు పంపితే వైసీపీ వందల కోట్లు తీసుకుని కార్పొరేట్లకు రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారు. గుజరాత్, ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీట్లు అమ్ముకుంది వైసీపీ కాదా... ? తండ్రి వైఎస్సార్‌ను హత్య చేశారని చెప్పి రిలయన్స్ వారికే రాజ్యసభ సీటు అమ్ముకున్న చరిత్ర మీ అధినేత జగన్ రెడ్డిది కాదా... ? వైసీపీ ఎస్సీలు, మైనార్టీలకు గానీ ఒక్క రాజ్యసభ సీటు ఇవ్వలేదు. 10 శాతం బీసీ రిజర్వేషన్లకు కోత కోసి 16,800 రాజ్యాంగబద్ద పదవులు దూరం చేసి జగన్‌రెడ్డి బీసీల గొంతుకోశారు’’ అని కిమిడి కళావెంకట్రావు పేర్కొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:25 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising