ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Central Govt: ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం మళ్లీ మొండిచేయి

ABN, First Publish Date - 2023-12-11T16:04:01+05:30

ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం మళ్లీ మొండిచేయి ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని లోక్‌సభలో కొంతమంది టీడీపీ, వైసీపీ ఎంపీలు కలిసి ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ప్రశ్నించగా ఆయన దాటవేసినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం మళ్లీ మొండిచేయి ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని లోక్‌సభలో కొంతమంది టీడీపీ, వైసీపీ ఎంపీలు కలిసి ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ప్రశ్నించగా ఆయన దాటవేసినట్లు తెలుస్తోంది. అయితే ఏపీతో పాటు మహారాష్ట్ర ఎంపీలు కూడా పంకజ్ చౌదరిని కలిసినట్లు సమాచారం. గత ఐదేళ్లలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని ఆయన తోసిపుచ్చారు.

కాగా.. కోవిడ్-19 దృష్ట్యా మూలధన వ్యయంలో పలు రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించే పథకాన్ని మాత్రం కేంద్రం అమలు చేసింది. ఇందులో భాగంగా 50 ఏళ్లలో తిరిగి చెల్లించేలా వడ్డీ లేని రుణాన్ని సమకూర్చినట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2020-21లో రూ. 688 కోట్లు, 2021-22లో 501.79 కోట్లు, 2022-23లో 6105.56 కోట్లు కేంద్రం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి 2020-21లో రూ. 358 కోట్లు, 2021-22లో 214.14 కోట్లు, 2022-23లో 2500.98 కోట్లు విడుదల చేసింది.

Updated Date - 2023-12-11T16:29:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising