Atchannaidu: ఇసుక పేరుతో జగన్‌రెడ్డి రూ. 40 వేల కోట్లు దోచేశారు
ABN, First Publish Date - 2023-11-02T20:59:24+05:30
నాలుగున్నరేళ్లలో గజదొంగ జగన్‌రెడ్డి ఇసుక బొక్కేసి రూ. 40 వేల కోట్లు దోచేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) ఎద్దేవ చేశారు.
అమరావతి: నాలుగున్నరేళ్లలో గజదొంగ జగన్‌రెడ్డి ఇసుక బొక్కేసి రూ. 40 వేల కోట్లు దోచేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ( Atchannaidu ) ఎద్దేవ చేశారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఇసుకను మీరు దోచేసి ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టడం సిగ్గనింపించడం లేదా? అధికారికంగా 110 రీచ్‌లల్లో ఇసుక తవ్వకాలు అని చెబుతూ 500కు పైగా రీచ్‌లల్లో ఇసుక దోచేయటం వాస్తవం కాదా? ఏపీలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ ఉత్వర్వులివ్వలేదా? మీ ఇసుక దోపిడికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి జగన్ రెడ్డి? ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై కేసు పెడితే మరి పేదల కడుపు కొట్టి రూ.40 వేల కోట్లు దోచుకున్న జగన్‌రెడ్డి, పెద్దిరెడ్డి, జే గ్యాంగ్‌లపై ఏం కేసులు పెట్టాలి? ఉచిత ఇసుక రద్దు చేసి, 40 లక్షల మంది కార్మికులను రోడ్డున పడేసి 160 మంది భవన నిర్మాణ కార్మికులను జగన్‌రెడ్డి బలిగొన్నారు. ఇప్పటికే 3 సార్లు ఇసుక పాలసీ మార్చారు. ఇప్పుడు జగన్ తన తమ్ముడు అనిల్‌రెడ్డికి ఇసుక కాంట్రాక్టు కట్టబెట్టేందుకు కొత్త నాటకానికి తెరలేపారు. ఇసుక టెండర్లు అనిల్‌రెడ్డికి కట్టబెట్టేందుకు టెండర్ నిబంధనలను మార్చేసి డాక్యుమెంట్ ధరను రూ.29.5 లక్షలుగా నిర్ధారించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న ఆరునెలల్లో రాష్ట్రంలో ఉన్న ఇసుకంతా దోచేయాలన్నదే జగన్‌రెడ్డి ప్లాన్, అందుకే చంద్రబాబుపై ఈ కుట్ర చేస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన సహజవనరుల్లో జే గ్యాంగ్ దేనిని వదలడం లేదు.ఇసుకతో పాటు బైరైటీస్, బాక్సైట్, లేటరైట్, రాక్సీ గ్రానైట్, సిలికా అన్నింటిని జగన్‌రెడ్డి దోచేస్తున్నారు’’ అని అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-11-02T20:59:25+05:30 IST