Nimmagadda Ramesh : ఏపీ ప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేష్ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-12-10T18:18:42+05:30
ఏపీ ప్రభుత్వం ( AP Govt )పై విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ (సీఎఫ్‌డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరంకుశత్వం, హింస, అసహనంతో ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచి ఆంధ్రప్రదేశ్‌కు చెడ్డపేరు తేవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సూచించారు.
తిరుపతి: ఏపీ ప్రభుత్వం ( AP Govt )పై విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ (సీఎఫ్‌డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరంకుశత్వం, హింస, అసహనంతో ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచి ఆంధ్రప్రదేశ్‌కు చెడ్డపేరు తేవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సూచించారు. ఆదివారం నాడు సిటీజన్స్ ఫర్ డెమోక్రసీ సదస్సులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే కార్యక్రమానికి ప్రభుత్వ వ్యవస్థను వాడుకోవటం తగదు. ఆంధ్రప్రదేశ్‌లో సమాచార హక్కు చట్టం భ్రష్టు పట్టిపోయింది. సలహాదారులకు కేబినెట్ హోదా ఇవ్వటం రాజ్యాంగబద్ధం కాదు. సలహాదారులు రాజ్యాంగేతర శక్తుల్లా తయారయ్యారు.
బ్రిటీష్ కాలంలో పెట్టిన సెక్షన్ 30 నియమిత కాలం మాత్రమే ఉండాలి. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం వినియోగించటం రాజ్యాంగానికి విరుద్ధం.బూత్ స్థాయిలో నిర్వీర్యం చేసేందుకే తప్పులు కేసులు పెడుతున్నారనే విమర్శలొస్తున్న నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీ గా పనిచేసిన సీనియర్ ఐ.పి.ఎస్.అధికారి ఎం.వి. భాస్కరరావు నేతృత్వంలో హిందూ దినపత్రిక విజయవాడ ఎడిషన్ పూర్వ రెసిడెంట్ ఎడిటర్ వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ పూర్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనగాని సత్యప్రసాద్‌లతో కమిటీ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వీరు ఆవిష్కరిస్తారు’’ అని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పేర్కొన్నారు.
Updated Date - 2023-12-10T18:34:30+05:30 IST