ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amaravathi : రాజధాని అమరావతిపై జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టు ఊహించని షాక్.. పదే పదే అడిగినా ఆఖరికి..!

ABN, First Publish Date - 2023-03-28T17:19:25+05:30

ఏపీ రాష్ట్ర రాజధానిపై (AP Capital) కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించట్లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఏపీ రాష్ట్ర రాజధానిపై (AP Capital) కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించట్లేదు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని (Amaravthi) మాత్రమే కొనసాగించాలని అమరావతి రైతులు (Amaravathi Farmers).. మరోవైపు హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో (Supreme Court) ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై న్యాయమూర్తి కె ఎం జోసెఫ్, బివి నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం నాడు సుదీర్ఘంగా విచారించింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టేని సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో జగన్ సర్కార్‌కు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంని కోరింది. ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పదే పదే కోరిన ఏపీ ప్రభుత్వ న్యాయవాదుల అడగడంతో సుప్రీంకోర్టు కాస్త ఆగ్రహానికి లోనైనట్లు తెలియవచ్చింది.

విచారణ ఇలా జరిగింది..!?

మరోవైపు.. అమరావతి రైతుల పిటిషన్‌‌తో పాటు ప్రభుత్వం పిటిషన్‌పై విచారణను జులై 11కి ధర్మాసనం వాయిదా వేసింది. ప్రభుత్వం తరపు పిటిషన్‌ను జులై 11న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని ధర్మాసనం చెప్పింది. మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అర్ధం లేదన్న ఏపీ తరపు సీనియర్ కౌన్సిల్ కెకె వేణుగోపాల్ వాదనలు వినిపించారు. అయితే.. ఏపీ ప్రభుత్వ లాయర్లు చేసిన విజ్ణప్తులను న్యాయమూర్తి జస్టిస్ కె ఎం జోసెఫ్ పట్టించుకోలేదు. జూన్ 16న జస్టిస్ కె ఎం జోసెఫ్ పదవీ విరమణ చేయనున్నారు. అందుకే కేసు విచారణను జులై 11కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. జులై 11న వేరే ధర్మాసనం ముందు అమరావతి కేసు విచారణకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తను రిటైర్ అవుతున్నందున అమరావతిపై సుదీర్ఘ వాదనలు విని జడ్జిమెంట్ రాసేందుకు సమయం లేదని న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ తెలిపారు. పిటిషన్ దాఖలు చేసిన వారిలో కొంతమంది రైతులు చనిపోయారని ప్రతివాదుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరణించిన వారి తరపున ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు న్యాయవాదులు అనుమతి కోరారు. అనుమతించి... వారికి నోటీసులు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది.

కేంద్రం ఇప్పటికే ఇలా..!

ఇదిలా ఉంటే.. అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసింది. అంతేకాదు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) మూడు రాజధానుల (Three Capitals) గురించి తమకు తెలియదని కేంద్రం స్పష్టం చేసింది. త్వరలోనే వైజాగ్‌కు మకాం మార్చుతానని పలుమార్లు జగన్ బహిరంగ సభల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో సుప్రీంలో అమరావతి కేసు విచారణలో ఏం తేలుతుందో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అనూహ్యంగా సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేయడం జరిగింది. వాస్తవానికి జనవరి 31న ఈ పిటీషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణకు రావాల్సి ఉంది. కొంత జాప్యం చోటుచేసుకోవడంతో మార్చి 28న విచారణ జరిగింది. కాగా.. రాజధాని తరలింపును ఆపాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం విదితమే.

ఒక కేసు ఉండగా.. మరొకటి ఎందుకు..?

ఇదిలా ఉంటే.. ఏపీ న్యాయవాదుల (AP lawyers )పై సుప్రీం కోర్టు (Supreme) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 8వ నెంబర్ కేసుపై విచారణ జరుగుతుండగా ధర్మాసనం ముందు అమరావతి కేసు (Amaravathi Case) ను ప్రస్తావించేందుకు ఏపీ న్యాయవాదులు ప్రయత్నించారు. దీంతో జస్టిస్ కేఎం జోసెఫ్ (Justice KM Joseph) అసహనం వ్యక్తం చేశారు. అమరావతి పిటీషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని ఏపీ తరపు సీనియర్ న్యాయవాదులు నఫ్డే, నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. అయితే ఒక కేసు సగం విచారణలో ఉండగా మరో కేసు ఎలా విచారించాలి..? అని న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక కేసు విచారణ పూర్తి కాకుండా.. మరో కేసు విచారించడం తగదని అన్నారు. న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏపీ లాయర్లు మిన్నకుండిపోయారు.

సుప్రీం అసహనం..!

కాగా.. సుప్రీం కోర్టులో కేసుల విచారణ జాబితా వరుస మారడంతో అమరావతి కేసుపై విచారణ ఆలస్యమైంది. మొదటి 5 కేసుల విచారణ తర్వాత 12వ నెంబర్ నుంచి 20 నెంబర్ కేసు వరకు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత 7వ నెంబర్ కేసు నుంచి 11వ నెంబర్ కేసు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత 21 నుంచి 39, 41వ నెంబర్ కేసులను కోర్టు విచారిస్తుంది. ప్రస్తుతం 10వ నెంబర్ కేసుగా అమరావతి రాజధాని కేసు ఉంది. అయితే ప్రస్తుతం 8వ నెంబర్ కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో అమరావతి కేసును ప్రస్తావించేందుకు ఏపీ లాయర్లు యత్నించడంతో సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

****************************

ఇవి కూడా చదవండి

******************************

YSRCP : ఉండవల్లి శ్రీదేవి ఏ పార్టీలో చేరబోతున్నారు.. తాడికొండ నుంచి బరిలోకి దింపడానికి జగన్‌ ఎవరెవర్ని పరిశీలిస్తున్నారు.. వైఎస్ సన్నిహితుడికేనా..!?

******************************

MLA Rapaka : టీడీపీ నుంచి 10 కోట్ల డీల్ వచ్చిందన్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాపాక యూటర్న్.. ఇంతకీ ఎవరా 10 మంది ఎమ్మెల్యేలు..!

******************************

MLC Kavitha ED Enquiry : కవిత మీడియాకు చూపించిన మొబైల్ ఫోన్లను కాస్త జూమ్ చేస్తే...!!

*****************************

YSRCP : ఓరి బాబోయ్.. సీఎం వైఎస్ జగన్ గురించి ఉండవల్లి శ్రీదేవి ఏమన్నారో చూడండి.. వీడియోలు నెట్టింట్లో వైరల్..

******************************

Kotam Reddy : వైఎస్ జగన్‌తో ఎక్కడ చెడింది.. 20 కోట్ల వ్యవహారమేంటి.. వైసీపీని వీడే ఎమ్మెల్యేల గురించి పూసగుచ్చినట్లుగా చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..!

******************************

YSRCP : ఉండవల్లి, మేకపాటిపై వేటు వేసే పరిస్థితి ఎందుకొచ్చింది.. ఓటింగ్‌కు ముందు జగన్‌తో భేటీ.. ఆ అరగంటలో ఏం జరిగింది.. ఒక్క మాటతో..!

******************************

Updated Date - 2023-03-28T17:57:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising