ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయం వెంటిలేటర్‌పై ఉంది

ABN, First Publish Date - 2023-09-05T20:44:55+05:30

వైసీపీ ప్రభుత్వం(YCP Govt)లో వ్యవసాయం(Agriculture) వెంటిలేటర్‌పై ఉందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు.

అనంతపురం: వైసీపీ ప్రభుత్వం(YCP Govt)లో వ్యవసాయం(Agriculture) వెంటిలేటర్‌పై ఉందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) అన్నారు. మంగళవారంనాడు రాయదుర్గం(Rayadurgam)లో చంద్రబాబు పర్యటించారు. సాయంత్రం భారీ బహిరంగా సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ..‘‘రైతులను జగన్ ప్రభుత్వం(Jagan Govt) మోసగించింది. పెట్టుబడి రాయితీలు ఇస్తామని రైతులతో ఆడుకుంటోంది.తెలుగుదేశం ప్రభుత్వం(Telugu Desam Govt) వచ్చాక పంట బీమా పథకాన్ని తీసుకువచ్చి రైతులను ఆదుకుంటాం.గోదావరి జలాలను రాయలసీమ(Rayalaseema)కు తేవాలనేదే నా ప్రయత్నం.టీడీపీ హయాంలో సాగునీటి కోసం రూ.69 వేల కోట్లు ఖర్చు చేశాం.రాయలసీమకు రూ.22 వేల కోట్లు ఖర్చు పెట్టాం.జగన్ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేసింది.టీడీపీ అధికారంలో ఉంటే సీమకు నీళ్లు ఇచ్చేవాళ్లం.రాయలసీమలో 102 ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం రద్దుచేసింది. ఏపీలో 34 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి.సీమలో 90 శాతం రాయితీతో మైక్రో ఇరిగేషన్‌ తీసుకువచ్చాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-05T20:44:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising