ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వామ్మో! ఈ ఆటోకేమైనా దయ్యం పట్టిందా.. డ్రైవర్ లేకుండానే ఇలా తిరుగుతుందేంటీ..

ABN, First Publish Date - 2022-12-06T18:39:04+05:30

సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాక.. ఎక్కడెక్కడో జరిగే చిత్రవిచిత్రమైన ఘటనలన్నీ క్షణాల వ్యవధిలో స్మార్ట్ ఫోన్‌లోకి వచ్చి చేరుతుంటాయి. వాటిలో కొన్ని తెగ నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ప్రస్తుతం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాక.. ఎక్కడెక్కడో జరిగే చిత్రవిచిత్రమైన ఘటనలన్నీ క్షణాల వ్యవధిలో స్మార్ట్ ఫోన్‌లోకి వచ్చి చేరుతుంటాయి. వాటిలో కొన్ని తెగ నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. డ్రైవర్ లే్కుండానే ఓ ఆటో గిరగిరా తిరగడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వామ్మో! దీనికేమైనా దయ్యం పట్టిందా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: యువతిని కలిసేందుకు వెనుక నుంచి బాల్కనీ ఎక్కిన యువకులు.. పైకి వెళ్లగానే ఏం జరిగిందంటే..

మహారాష్ట్రలోని (Maharashtra) రత్నగిరి పరిధి జైల్ నాకా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా రద్దీగా ఉన్న రోడ్డుపై అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న ఆటో.. హఠాత్తుగా కదలింది. కదలడమే కాకుండా గిరగిరా రౌండ్లు తిరుగుతూనే ఉంది. డ్రైవర్ లేకుండా తిరుగుతున్న ఆటోను చూసి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తర్వాత దాని వద్దకు వెళ్లి ఆపే ప్రయత్నం చేశారు. కానీ మొదట అది సాధ్యం కాలేదు. ఎంతమంది ప్రయత్నించినా.. ఆటోను మాత్రం ఆపలేకపోయారు. ఇలా కొద్ది సేపటి తర్వాత ఎలాగోలా అంతా కలిసి దాన్ని ఆపగలిగారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral videos) అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఈ వధూవరులు డ్యాన్స్ చేసిన పాట విని అంతా షాక్... మధ్యలో అక్కడికి వచ్చిన వధువు తండ్రి..

Updated Date - 2022-12-06T18:39:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising