Viral Video: ఈ వధూవరులు డ్యాన్స్ చేసిన పాట విని అంతా షాక్... మధ్యలో అక్కడికి వచ్చిన వధువు తండ్రి..

ABN , First Publish Date - 2022-12-04T15:45:22+05:30 IST

వివాహ వేడుకలో వధూవరులు (bride and groom) డాన్స్ వేయడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. గతంలో మాదిరి కాకుండా ఇటీవల యువతులు కూడా వివాహ వేడుకల్లో యువకులకు దీటుగా..

Viral Video: ఈ వధూవరులు డ్యాన్స్ చేసిన పాట విని అంతా షాక్... మధ్యలో అక్కడికి వచ్చిన వధువు తండ్రి..

వివాహ వేడుకలో వధూవరులు (bride and groom) డ్యాన్స్ వేయడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. గతంలో మాదిరి కాకుండా ఇటీవల యువతులు కూడా వివాహ వేడుకల్లో యువకులకు దీటుగా హడావుడి చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ వేడుకలో వరుడితో పాటూ వధువు కూడా డ్యాన్స్ చేస్తుంది. అయితే వారు డాన్స్ వేసిన పాట విని అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. మధ్యలో అక్కడికి వచ్చిన వధువు తండ్రి ఏం చేశాడంటే..

ఆ పని చేయాలంటూ కూతురిపై తల్లి ఒత్తిడి.. వీడియోలను బయటపెట్టిన యువతి చివరకు ఏం చేసిందంటే..

వివాహ వేడుకలో వధూవరులు వేసిన డ్యాన్స్ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. వధూవరులను డ్యాన్స్ వేయాలంటూ పక్కనున్న వారు డీజే సాంగ్ (DJ Songs) ప్లే చేస్తారు. అయితే మామూలు పాట అయితే ఎలాంటి సమస్య ఉండేది కాదు. 'దిల్ సే హున్ బీసీ' అనే హిందీ పాట ప్లే చేస్తారు. ఆ పాటలో అసభ్యకర పదాలు ఉండడంతో అంతా అవాక్కవుతారు. అయితే వరుడు మాత్రం అవేవీ పట్టించుకోకుండా డాన్స్ వేస్తుంటాడు. వధువును కూడా డ్యాన్స్ వేయమంటూ ఎంకరేజ్ చేస్తాడు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో ఆమె కూడా అతడితో పాటూ కాసేపు కాలు కదుపుతుంది. అయితే పాటలో అసభ్యకర పదాలు ఉండడంతో పక్కనున్న వారంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో మధ్యలో వధువు తండ్రి డీజే వద్దకు వెళ్లి.. పాటను ఆపమని చెబుతాడు. ఈ వీడియో (Dance videos) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఇదేం పైత్యం.. వేదికపై హుక్కా తాగిన వధువు.. వరుడికి ఎలా ముద్దు పెట్టిందో చూడండి..

Updated Date - 2022-12-04T15:47:58+05:30 IST