Viral Video: ఇదేం పైత్యం.. వేదికపై హుక్కా తాగిన వధువు.. వరుడికి ఎలా ముద్దు పెట్టిందో చూడండి..

ABN , First Publish Date - 2022-12-03T17:27:12+05:30 IST

కొన్నిసార్లు కొందరి పిచ్చి పీక్స్‌కి వెళ్తుంటుంది. చుట్టూ ఎవరున్నారనే విషయాన్ని మర్చిపోయి.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. వివాహ సమయాల్లో వధూవరుల విషయంలోనూ ..

Viral Video: ఇదేం పైత్యం.. వేదికపై హుక్కా తాగిన వధువు.. వరుడికి ఎలా ముద్దు పెట్టిందో చూడండి..

కొన్నిసార్లు కొందరి పిచ్చి పీక్స్‌కి వెళ్తుంటుంది. చుట్టూ ఎవరున్నారనే విషయాన్ని మర్చిపోయి.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటారు. వివాహ సమయాల్లో వధూవరుల విషయంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. తమ వివాహం గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కొందరు వినూత్న పద్ధతుల్లో వీడియోలు చేస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వేదికపై వరుడికి వధువు కిస్ (kiss) పెట్టడాన్ని చూసి.. నెటిజన్లు అవాక్కవుతున్నారు. అందరి ముందే హుక్కా (hookah) తాగిన వధువు.. ఆ పొగను వరుడి నోట్లో ఊదింది. దీనిపై ఇదేం పిచ్చిరా దేవుడా.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Revenge Plan: సమాజం ఎటుపోతోంది.. ఓ 15 ఏళ్ల పిల్లాడు చేయాల్సిన పనులేనా ఇవి..!

marriage.jpg

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. వివాహ వేదికపై వధూవరులు (bride and groom) ఆశీనులై ఉంటారు. వీడియోలకు ఫోజులు ఇచ్చే క్రమంలో ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నారో ఏమో గానీ.. మొత్తానికి అందరికీ షాక్ ఇచ్చేలా ప్రవర్తించారు. వధువు ముందుగా ఎదురుగా ఉన్న హుక్కాను పీల్చుతుంది. తర్వాత ఆ పొగను మొత్తాన్ని వరుడి నోట్లో నోరు ఫెట్టి ఊదేస్తుంది. తర్వాత వరుడు మళ్లీ ఆ పొగను పైకి వదులుతాడు. పెళ్లికి వచ్చిన అతిథులంతా ఈ దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. అలాగే ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వధువేంట్రా మరీ ఇలా చేసింది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

లిఫ్ట్ అడిగి మరీ మహిళా ప్రొఫెసర్‌ కారులో ఎక్కాడు.. ‘‘మేడం నా ఫోకస్ అంతా మీ పైనే’’ అంటూ నవ్వుతూనే..

Updated Date - 2022-12-03T17:31:47+05:30 IST