కల్దూర్కిలో రసవత్తరంగా కుస్తీ పోటీలు
ABN, First Publish Date - 2020-02-10T11:43:51+05:30
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని క ల్దూర్కి గ్రామంలో ఆదివారం ఈరన్నదేవాలయం వార్షికోత్సవాన్ని
బోధన్‌రూరల్, ఫిబ్రవరి 9: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని క ల్దూర్కి గ్రామంలో ఆదివారం ఈరన్నదేవాలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొ ని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీపోటీలు నిర్వహించారు. ఈకుస్తీపోటీ ల్లో చుట్టూ పక్కల గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుం చి మల్లయోధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుస్తీపోటీలు హోరాహోరిగా కొన సాగాయి. ఈ సందర్భంగా విజేతలకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహు మ తులు అందజేశారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు
ఈరన్న ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామం లో వార్షికోత్సవం సందర్భంగా జాతరను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
Updated Date - 2020-02-10T11:43:51+05:30 IST