ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పెన్షన్ లేకపోతే వారంతా ఏమవ్వాలి: గద్దె రామ్మోహన్ ఫైర్

ABN, First Publish Date - 2020-02-10T17:14:33+05:30

విజయవాడ: పింఛన్ల తీసివేతపై టీడీపీ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన కార్యక్రమం జరిగింది.

విజయవాడ: పింఛన్ల తీసివేతపై టీడీపీ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, పింఛన్ రద్దు అయిన మహిళలు, వృద్దులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. సీఎం జగన్.. పాలనను పక్కనబెట్టి ప్రజలపై కక్ష సాధిస్తున్నారన్నారు.

వృద్దులు, వికలాంగులు, వితంతు పెన్షన్లు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. పెన్షన్ లేకపోతే వృద్దులు, వికలాంగులు ఎలా బతకాలని గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. వీరు ఆత్మస్థైర్యంతో జీవించాలని 200 ఉన్న పెన్షన్‌ను టీడీపీ 2000 వేలకు పెంచిందన్నారు. జగన్‌కి వైసీపీ వారు తప్ప రాష్ట్రంలో ఎవ్వరూ కనిపించడం లేదన్నారు. జగన్‌కి పిచ్చి ముదిరి పాకానపడుతోందన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే.. ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.


Updated Date - 2020-02-10T17:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising