ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై చంద్రబాబు రియాక్షన్ ఇదీ..
ABN, First Publish Date - 2020-02-10T19:18:46+05:30
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
అమరావతి: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇవాళ విజయవాడ హెల్ప్ ఆస్పత్రిలో ఏఎన్‌యూ విద్యార్థులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై ప్రభుత్వ కక్ష సాధింపును ఖండిస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో మెరిట్ ప్రకారమే పోస్టింగ్‌లు ఇచ్చామని మరోసారి బాబు స్పష్టం చేశారు.
రేపు మీ వంతు వస్తుంది!
‘ఇప్పటి వరకు పోలీస్ అధికారులకు జీతాలు ఇవ్వరా?. ఇంతటి దుర్మార్గ పాలన దేశంలోఎక్కడా చూడలేదు. ఆగమేఘాల మీద అర్ధరాత్రి జీవోలు ఇస్తున్నారు. పోలీసులు.. అధికారులకు చెబుతున్నా.. ఇవాళ వెంకటేశ్వరరావు.. రేపు మీ వంతు వస్తుంది. తప్పు చేస్తే చర్యలు తీసుకోండి.. కానీ రాజకీయ కక్షతో వ్యవహరించడం తగదు’ అని ప్రభుత్వాన్ని బాబు ఒకింత హెచ్చరించారు.
Updated Date - 2020-02-10T19:18:46+05:30 IST