ముఖ్యమంత్రిగా చేసావ్..ఆ మాత్రం బుద్ధి లేదా జగన్
ABN, Publish Date - Feb 25 , 2025 | 10:06 PM
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగించిన సమయంలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరును స్పీకర్ అయ్యన్నపాత్రుడు తప్పు పట్టారు. ఎమ్మెల్యే శిక్షణ తరగతులపై సాక్షి పత్రికలో వచ్చిన కథనాలపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని టీడీపీ సభ్యుడు కోరడంతో .. దీనిని సభ హక్కుల కమిటికి స్పీకర్ రిఫర్ చేశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగించిన సమయంలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరును స్పీకర్ అయ్యన్నపాత్రుడు తప్పు పట్టారు. ఎమ్మెల్యే శిక్షణ తరగతులపై సాక్షి పత్రికలో వచ్చిన కథనాలపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని టీడీపీ సభ్యుడు కోరడంతో .. దీనిని సభ హక్కుల కమిటికి స్పీకర్ రిఫర్ చేశారు. సభలో సోమవారం నాటి పరిణామాలు బాధ కలిగించాయన్నారు. వైసీపీ సభ్యుల తీరును ప్రజలు అసహించుకునే విధంగా ఉందని తెలిపారు. సీఎంగా పని చేసిన వ్యక్తి సభ్యతను మరిచి ప్రవర్తించడమే కాకుండా.. తన పార్టీ ఎమ్మెల్యేలను నియంత్రించే పని చేయలేదని మండిపడ్డారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 25 , 2025 | 10:46 PM