అనకాపల్లి ఎంపీ ఫిర్యాదుతో.. జమ్మలమడుగులో పేకాట క్లబ్ మూసివేసిన పోలీసులు..
ABN, Publish Date - Feb 05 , 2025 | 05:22 PM
జమ్మలమడుగులోని ఓ క్లబ్‌లో పగలు రాత్రి తేడా లేకుండా అనధికారికంగా పేకాట నిర్వహిస్తున్నట్లు ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేష్ నాయుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్లబ్ మూసివేశారు.
జమ్మలమడుగులో స్థానిక కూటమి నేతల ఆధ్వర్యంలో ముద్దనూరు రోడ్డులోని రిపబ్లిక్ క్లబ్ అనధికారికంగా పేకాట నిర్వహిస్తోందని ఇటీవల ఏబీఎన్ వరస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి క్లబ్ మూసివేశారు.
Updated Date - Feb 05 , 2025 | 05:49 PM