ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బరితెగించిన గంజాయి బ్యాచ్..

ABN, Publish Date - Feb 03 , 2025 | 04:01 PM

Hyderabad: నగరంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ హల్‌చల్ చేసిన ఈ గ్యాంగ్.. అకారణంగా ఓ యువకుడిని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: నగరంలోని మణికొండలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో పొచమ్మ కాలనీ ఓ యువకుడిని చితకబాదింది ఈ గ్యాంగ్. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. యువకుడిపై గంజాయి బ్యాచ్ దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. గత అర్ధరాత్రి మణికొండ పొచ్చమ్మ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడిపై గంజాయి బ్యాచ్ దాడి చేస్తున్న సమయంలో యువకుడు కేకలు వేశాడు. వెంటనే గమనించిన కాలనీ వాసులు అక్కడకు చేరుకునే లోపు.. ఆ బ్యాచ్ అక్కడి నుంచి పరారైంది.


ఓ బైక్‌ను వదిలి మరీ పారిపోయారు యువకులు. పది మంది యువకులు.. గంజాయి సేవించి అర్ధరాత్రి బైక్స్‌పై తిరుగుతూ హల్‌చల్ చేయడంతో పాటు.. వచ్చీపోయే వారిపై అకారణంగా దాడులకు దిగుతున్నారు. వీరి ఆకృత్యాలపై పలు సార్లు పోలీసులకు కాలనీ వాసులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోని పరిస్థితి. యువకుడిపై దాడి చేసిన గ్యాంగ్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

KTR: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. వేటు తప్పదా..


ఇవి కూడా చదవండి..

ఈ రాశి వారు బంధుమిత్రులతో సందడిగా గడుపుతారు !

Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 03 , 2025 | 04:01 PM