ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాలికల గురుకులాలను.. మహిళా ఐఏఎ్‌సలు సందర్శించాలి

ABN, Publish Date - Jan 02 , 2025 | 04:45 AM

రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు ప్రభావంతంగా నడవడానికి, నాణ్యమైన విద్యను అందించడానికిగాను ప్రభుత్వం మహిళా ఐఏఎస్‌ అధికారులు, అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది.

  • ఇతర గురుకులాలు, కేజీబీవీలు, హాస్టళ్ల పర్యవేక్షణ అదనపు కలెక్టర్లకు

  • ఒక్కసారైనా విద్యాలయాల్లో బస చేయాలి

  • నివేదికలు సమర్పించాలి: ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు ప్రభావంతంగా నడవడానికి, నాణ్యమైన విద్యను అందించడానికిగాను ప్రభుత్వం మహిళా ఐఏఎస్‌ అధికారులు, అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. బాలికల గురుకులాలను మహిళా ఐఏఎ్‌సలు, ఇతర గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ హస్టళ్లను అదనపు కలెక్టర్లు పర్యవేక్షించాలని నిర్దేశించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్రంలోని మహిళా ఐఏఎస్‌ అధికారులు ఈ జనవరి నుంచి పదిహేను రోజులకొకసారైనా బాలికల గురుకుల విద్యాలయాలను సందర్శించాలని, ఈ సందర్శనల్లో ఒక్కసారైనా అక్కడే రాత్రి బస చేయాలని ఆదేశించింది. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని సూచించింది. విద్యాలయాలు సరిగా పని చేయడంలో ఉన్న లోపాలను గుర్తించి, ఏడు రోజుల్లోగా గురుకుల విద్యాలయ సంబంధిత ఎస్సీ/బీసీ/మైనారిటీ/విద్యా శాఖలకు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. విద్యాలయాల్లో మెరుగైన పరిస్థితులు కల్పించడానికి అవసరమైన సూచనలు చేయాలని తెలిపింది.


ఈ సందర్శనలకు ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారని వెల్లడించింది. అదనపు కలెక్టర్లు తమ జిల్లా పరిధిలోని గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ హాస్టళ్లన్నింటినీ సందర్శించాలని ఆదేశించింది. మౌలిక సదుపాయాలు, తరగతి గదులు, హాస్టళ్లలో భోజన శాలలు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించాలని, నాణ్యమైన విద్య అందుతుందో లేదో చూడాలని పేర్కొంది. విద్యాలయాలు, హాస్టళ్ల సరుకుల కొనుగోలు కమిటీలకు అదనపు కలెక్టర్లే చైర్మన్లుగా వ్యవహరించాలని, విద్యార్థులకు ఆహార పదార్థాలు అందుతున్నాయో లేదో పరిశీలించాలని నిర్దేశించింది. పక్షం రోజులకొకసారైనా అదనపు కలెక్టర్లు విద్యాలయాల్లో రాత్రి నిద్ర చేయాలని ఆదేశించింది. ఆ సందర్భంగా విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకోవాలని తెలిపింది. ఆకస్మిక తనిఖీలు కూడా చేపట్టాలని ఆదేశించింది. మారుమూల ప్రాంతాల్లోని విద్యాలయాలపై ఎక్కువ ధ్యాస పెట్టాలని తెలిపింది. విద్యాలయాలను సందర్శించినప్పుడు పరిశీలించిన అంశాలపై నెలవారీ నివేదికలను రూపొందించాలని, వాటిని తమ కలెక్టర్లకు అందజేయాలని అదనపు కలెక్టర్లను ఆదేశించింది. కలెక్టర్లు కూడా ఈ నివేదికలపై నెలవారీగా సమీక్షించాలని తెలిపింది.

Updated Date - Jan 02 , 2025 | 04:46 AM