సీఎం రేవంత్ చిత్రపటానికి పాలతో అభిషేకం
ABN, Publish Date - Jan 11 , 2025 | 04:35 AM
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే గ్రామపంచాయతీ ఉద్యోగులకు ప్రతినెలా వేతనాలు చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే గ్రామపంచాయతీ ఉద్యోగులకు ప్రతినెలా వేతనాలు చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించడం హర్షణీయమని తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల నర్సింహులు, ఇతర కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.
ఈ మేరకు శుక్రవారం వారు సచివాలయం వద్ద సీఎం చిత్రపటానికి పాలతో అభిషేకం చేసి తమ ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేందుకు కృషి చేసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అనుసూయ సీతక్కకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Jan 11 , 2025 | 04:35 AM