Uttam: పదేళ్లలో కృష్ణా బేసిన్‌లో.. ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలే
ABN, Publish Date - Feb 22 , 2025 | 04:58 AM
పదేళ్లలో కృష్ణా బేసిన్‌లో ఒక్క ప్రాజెక్టును కూడా బీఆర్‌ఎస్ సర్కారు పూర్తి చేయలేదని, దీని వల్ల 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే ప్రాజెక్టులను దక్షిణ తెలంగాణ కోల్పోయిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు.
100 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాం
కృష్ణా జలాల్లో వాటా సాధనలోనూ విఫలం
కేసీఆర్, హరీశ్‌లే దీనికి కారణం: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): పదేళ్లలో కృష్ణా బేసిన్‌లో ఒక్క ప్రాజెక్టును కూడా బీఆర్‌ఎస్ సర్కారు పూర్తి చేయలేదని, దీని వల్ల 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే ప్రాజెక్టులను దక్షిణ తెలంగాణ కోల్పోయిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ప్రజలను తాకట్టుపెట్టి, రూ.1.81లక్షల కోట్ల అప్పులు తెచ్చినా.. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయమే చేసిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో పని చేసిన మంత్రులు, నేతలకు కృష్ణా ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
బీఆర్‌ఎస్ పదేళ్ల నిర్లక్ష్యం ఫలితంగా ఏటా 100 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కోల్పోయాయని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులే ఇందుకు కారణమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న మూడేళ్లలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తుందని ఉత్తమ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
Updated Date - Feb 22 , 2025 | 04:58 AM