Uttam Kumar Reddy: నిర్ణీత వ్యవధిలోగా ప్రాజెక్టులు పూర్తి కావాలి: ఉత్తమ్
ABN, Publish Date - Feb 16 , 2025 | 04:00 AM
ప్రాజెక్టుల నిర్మాణాలను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టుల నిర్మాణాలను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జలసౌధలో నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 18, 19 తేదీల్లో రాజస్థాన్‌లో అఖిల భారత నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర సాగునీటి రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలపై సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. అనంతరం ఎస్‌ఎల్‌బీసీ, డిండి, పాలమూరు-రంగారెడ్డి, దేవాదుల తదితర ప్రాజెక్టుల పురోగతిపై మంత్రికి అధికారులు నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో నీటి నిల్వల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు.
Updated Date - Feb 16 , 2025 | 04:00 AM