ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttam: సిగ్గుండాలె..దుర్మార్గపు మాటలొద్దు

ABN, Publish Date - Jan 21 , 2025 | 03:51 AM

తెలంగాణలో అర్హత ఉన్న వారందరికీ రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు.

  • మీ హయాంలో చేసింది శూన్యం

  • బీఆర్‌ఎ్‌సపై మంత్రి ఉత్తమ్‌ ఫైర్‌

హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అర్హత ఉన్న వారందరికీ రేషన్‌కార్డులు జారీ చేస్తామని మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. కొత్త రేషన్‌కార్డుల జారీ, పాత రేషన్‌ కార్డుల్లో కొత్త సభ్యుల చేరికపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ‘దుర్మార్గపు మాటలు మాట్లాడొద్దు. పదేళ్లలో మీరు 40 వేల మందికే. కార్డులిచ్చారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌ కార్డులుంటే అందులో సభ్యులు 2.81 కోట్లమంది ఉన్నారు. కొత్తగా రేషన్‌ కార్డుల జారీ, పాత కార్డుల్లో సభ్యుల చేరికతో రాష్ట్రంలో 40లక్షల మందికి మేలు జరుగుతుందని భావిస్తున్నాం. దీనివల్ల ఏటా రూ.11వేల కోట్ల భారం పడే అవకాశం ఉన్నా ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ప్రకటించారు. సచివాలయంలో మంత్రి పొన్నంతో కలిసి ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు. 26వ తేదీన రేషన్‌ కార్డుల జారీ ఉంటుందని, అర్హులందరికీ కార్డులు ఇచ్చే దాకా నిరంతరంగా ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు.


దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) ద్వారా సన్న బియ్యం ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ నిలవనుందని ఉత్తమ్‌ చెప్పారు. సమాజానికి, రాష్ట్రానికి మంచి జరిగే కార్యక్రమం చేపడితే పిచ్చి పిచ్చి విమర్శలేంటని, అసలు మీకు సిగ్గుందా అని ఉత్తమ్‌ మండిపడ్డారు. రేషన్‌ కార్డుల వివరాల పరిశీలనకు సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా వివరాలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. కొత్తగా ప్రజాపాలన సేవా కేంద్రాల్లో, గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులందరికీ రేషన్‌కార్డులు జారీ చేస్తామన్నారు. కాగా, కృష్ణా జలాలను రాష్ట్రాల వారీగా పంచాలని తీర్పు వస్తే... అందులో కూడా వారి పాత్ర ఉందని ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి ఉత్తమ్‌ మండిపడ్డారు. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కృష్ణా జలాలు బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయిస్తే... రాష్ట్ర అవతరణ అనంతరం 2015లో తమకు 299 టీఎంసీలు చాలని అంగీకారం తెలుపుతూ కేసీఆర్‌, హరీశ్‌రావు సంతకాలు చేయలేదా...? అని ప్రశ్నించారు.

Updated Date - Jan 21 , 2025 | 03:51 AM