ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala: కృష్ణాజలాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

ABN, Publish Date - Feb 25 , 2025 | 03:58 AM

కృష్ణాజలాల పంపకాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సత్వర పరిష్కారం చూపాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

  • సత్వర పరిష్కారం చూపాలన్న మంత్రి తుమ్మల

ఏన్కూరు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): కృష్ణాజలాల పంపకాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సత్వర పరిష్కారం చూపాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు హిమాంనగర్‌ సమీపంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ వద్ద జరుగుతున్న రాజీవ్‌ లిఫ్ట్‌ కెనాల్‌ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. రాజీవ్‌ లిఫ్ట్‌ కెనాల్‌తో వైరా, మధిర, సత్తుపల్లి ప్రాంతాలకు సాగునీటి ఇబ్బంది తొలగుతుందన్నారు.


నాగార్జునసాగర్‌ కాల్వలకు గోదావరి జలాలను అనుసంధానం చేయడం ద్వారా ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ నీటిని ఎక్కువగా వినియోగిస్తుండటంతో తెలంగాణకు నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్ర రైతులు నష్టపోకముందే కేంద్ర ప్రభుత్వం నీటి పంపకాలు తేల్చి నీటిని విడుదల చేయాలని తుమ్మల కోరారు.

Updated Date - Feb 25 , 2025 | 03:58 AM