TGSRTC: శివరాత్రికి 3 వేల ప్రత్యేక బస్సులు
ABN, Publish Date - Feb 23 , 2025 | 04:13 AM
మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.
50 శాతం అదనపు చార్జీలతో అందుబాటులో..
మహిళలకు ఉచిత ప్రయాణం యఽథాతథం: సజ్జనార్
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 26న మహా శివరాత్రి కాగా, 24 నుంచి 28 వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. రెగ్యులర్ సర్వీ్‌సల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. కానీ, ఈ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు అదనపు చార్జీలను వసూలు చేస్తారు.
గత శివరాత్రితో పోలిస్తే ఈసారి 809 బస్సులను అదనంగా నడపనున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథాతథంగా అమల్లో ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించామని, టికెట్ల బుకింగ్‌ను .. వెబ్‌సైట్ లో చేసుకోవచ్చన్నారు.
Updated Date - Feb 23 , 2025 | 04:13 AM