ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కృష్ణాలో వాటాలు తేల్చాకే గోదావరి-కావేరీ అనుసంధానం చేపట్టాలి

ABN, Publish Date - Feb 04 , 2025 | 04:07 AM

కృష్ణా జలాల పంపిణీని జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌(కృష్ణా ట్రైబ్యున ల్‌) తేల్చిన తర్వాతే గోదావరి-కావేరీ అనుసంఽధానం చేపట్టాలని తెలంగాణ పేర్కొంది.

  • ఎన్‌డబ్ల్యూడీఏ మినిట్స్‌లో చేరిన తెలంగాణ వాదన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల పంపిణీని జస్టిస్‌ బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌(కృష్ణా ట్రైబ్యున ల్‌) తేల్చిన తర్వాతే గోదావరి-కావేరీ అనుసంఽధానం చేపట్టాలని తెలంగాణ పేర్కొంది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) 38వ వార్షిక సర్వసభ్య సమావేశం గత డిసెంబరు 19న జర గ్గా... ఆ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ సోమవారం రాష్ట్రాలకు చేరాయి. ఆ సమావేశంలో తెలంగాణ తరఫున ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ లేవనెత్తిన అంశాలను చేర్చుతూ మినిట్స్‌ విడుదల చేశారు.


గోదావరి-కావేరీ అనుసంధానంలో తరలించే 141 టీఎంసీల్లో 50 శాతం వాటా ఇవ్వాలని తెలంగాణ కోరింది. గోదావరి-కావేరీని ఇచ్చంపల్లి నుంచి కాకుండా సమ్మక్కసాగర్‌ నుంచి తర లించాలని తెలంగాణ కోరింది. కృష్ణా జలాల పంపిణీపై విచారణ జరుగుతున్నందున... నీటి వాటాలు తేల్చేక, ప్రాజెక్టుల ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ ఖరారు అయ్యాక గోదావరి-కావేరిపై ముందుకెళదామని పేర్కొన్నారు.

Updated Date - Feb 04 , 2025 | 04:07 AM