ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వక్ఫ్‌ బోర్డు సీఈవోగా అసాదుల్లాను తక్షణం తొలగించండి

ABN, Publish Date - Jan 31 , 2025 | 04:08 AM

తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఫుల్‌ టైం సీఈవోగా ఉన్న అసాదుల్లాను తక్షణం తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.

  • రాష్ట్ర ప్రభుత్వం, వక్ఫ్‌ బోర్డులకు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఫుల్‌ టైం సీఈవోగా ఉన్న అసాదుల్లాను తక్షణం తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు నెలల్లో పూర్తికాలపు సీఈవోను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డులకు ఆదేశాలు జారీచేసింది. డిప్యూటీ సెక్రటరీ కంటే తక్కువ ర్యాంకు కలిగిన అసాదుల్లాను సీఈవోగా నియమించడం వక్ఫ్‌ చట్టం 1995 సెక్షన్‌ 23కు విరుద్ధమని పేర్కొంది.


35 ఏళ్ల ప్రభుత్వ సర్వీసు చేసినప్పటికీ అసాదుల్లా స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ ర్యాంకు కలిగిన అధికారి అని గుర్తు చేసింది. ముస్లిం అధికారులు లేరన్న కారణంతో తక్కువ ర్యాంకు కలిగిన అఽధికారిని నియమించడం చెల్లదని పేర్కొంది. కొత్త ఫుల్‌టైం సీఈవోను నియమించే వరకు ఆథరైజ్డ్‌ ఆఫీసర్‌గా ఉన్న షేక్‌ లియాకత్‌ హుస్సేన్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగవచ్చని పేర్కొంది

Updated Date - Jan 31 , 2025 | 04:08 AM