ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళా సాధికారత కోసం పలు పథకాలు

ABN, Publish Date - Mar 10 , 2025 | 03:56 AM

మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ డాక్టర్‌ హరీశ్‌ తెలిపారు.

  • మహిళా జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డుల జారీలో సముచిత ప్రాధాన్యం

  • సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ డాక్టర్‌ హరీశ్‌ తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా సీఎం రేవంత్‌ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో ఆదివారం మహిళా జర్నలిస్టుల కోసం ‘ఆన్‌లైన్‌ జర్నలిజం-మహిళా జర్నలిస్టుల పాత్ర’ అనే అంశంపై ఒక రోజు శిక్షణ తరగతుల కార్యక్రమంలో హరీశ్‌ గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళా జర్నలిస్టులు జర్నలిజంలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహిళా జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డుల జారీలో సముచిత ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.


తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ జర్నలిజంలో మహిళల సంఖ్య మరింత పెరగాలని, మహిళలను ప్రోత్సహించేందుకు అకాడమీ తరఫున ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఐఎ్‌సబీ డేటా సైన్స్‌ కళాశాల ప్రొఫెసర్‌ మధు విశ్వనాథం ‘ఆన్‌లైన్‌ జర్నలిజం మెలకువలు-సోషల్‌ మీడియా ప్రణాళిక’ అనే అంశంపై, కృత్రిమ మేధస్సు నిపుణుడు రాకేష్‌ దుబ్బుడు ‘వార్తల మూలం-విషయ పరిజ్ఞానం’పై, ‘ఆన్‌లైన్‌ జర్నలిజం, నావిగేషన్‌, విశ్వసనీయత, కృత్రిమ మేధస్సు’పై హైదరాబాద్‌ యూనివర్సిటీ సీనియర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మాధవి రవికుమార్‌, ‘ఫేక్‌ న్యూస్‌-గందరగోళ పరిచే వార్తలు’ అనే అంశంపై ఐఎ్‌సబీ డేటా సైన్స్‌ కళాశాల అసోసియేట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రుతి ప్రసంగించారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వేంకటేశ్వరరావు, మహిళా జర్నలిస్టుల సమన్వయ కర్త రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

BRS:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..

TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

AICC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా అంటే..

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 10 , 2025 | 03:56 AM