ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TET Results: టెట్‌లో 31% ఉత్తీర్ణత

ABN, Publish Date - Feb 06 , 2025 | 03:43 AM

గత నెలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ.నరసింహారెడ్డితో కలిసి ఈ ఫలితాలను వెలువరించారు.

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): గత నెలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ.నరసింహారెడ్డితో కలిసి ఈ ఫలితాలను వెలువరించారు. టెట్‌ పరీక్ష రెండు పేపర్లకు మొత్తం 1,35,802 మంది హాజరవ్వగా 42,384 (31.21%) మంది అర్హత సాధించారు. పేపర్‌-1కు 69,476 మంది హాజరవ్వగా 41,327(59.48%) మంది ఉత్తీర్ణ సాధించారు.


అలాగే పేపర్‌-2లో మ్యాథమెటిక్స్‌, సైన్స్‌ పరీక్షకు 69,390 మంది హాజరవ్వగా 23,755(34.24%)మంది, సోషల్‌ స్టడీస్‌ పరీక్ష 66,412 మంది రాయగా 18,629(28.05%) మంది అర్హత సాధించారని యోగితా రాణా తెలిపారు. జనవరి 24న సబ్జెక్టుల వారీగా ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్లను విడుదల చేసిన విద్యాశాఖ జనవరి 27వ తేదీ వరకు అభ్యతరాలు స్వీకరించి బుధవారం తుది కీ, ఫలితాలు ప్రకటించింది.

Updated Date - Feb 06 , 2025 | 03:43 AM