పెరుగుతున్న టారిఫ్ సబ్సిడీ భారం
ABN, Publish Date - Feb 09 , 2025 | 04:12 AM
రాష్ట్ర ప్రభుత్వ పూచీతో వివిధ వర్గాలకు ఉచితంగా, సబ్సిడీ రూపంలో సరఫరా చేస్తున్న విద్యుత్‌కుగాను ఏటా డిస్కమ్‌లకు చెల్లించాల్సిన టారిఫ్ సబ్సిడీల భారం గణనీయంగా పెరుగుతోంది.
2025-26లో రూ.20,151 కోట్లు కోరనున్న డిస్కమ్‌లు
గతేడాది రూ.16,825 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ పూచీతో వివిధ వర్గాలకు ఉచితంగా, సబ్సిడీ రూపంలో సరఫరా చేస్తున్న విద్యుత్‌కుగాను ఏటా డిస్కమ్‌లకు చెల్లించాల్సిన టారిఫ్ సబ్సిడీల భారం గణనీయంగా పెరుగుతోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో టారిఫ్ సబ్సిడీ రూ.4,410.12 కోట్లు ఇవ్వగా... 2024-25నాటికి రూ.16,825 కోట్లకు చేరింది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.20,151 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం నుంచి కోరాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి.
ఈ మేరకు లోటుతో వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్‌ఆర్) పిటిషన్‌ను దాఖలు చేశాయి. అయితే వచ్చే బడ్జెట్‌లో ఏమేరకు సబ్సిడీని కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇక సబ్సిడీతోపాటు ఉచితంగా విద్యుత్‌ను వాడే వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో గృహ వినియోగదారులకు 200 యూనిట్లదాకా ఉచితంగా విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే.
Updated Date - Feb 09 , 2025 | 04:12 AM