ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సౌదీలో తెలంగాణ ప్రవాసీ దారుణ హత్య

ABN, Publish Date - Mar 02 , 2025 | 05:01 AM

సౌదీ అరేబియాలో సహచరుడి చేతిలో తెలంగాణ ప్రవాసీ దారుణ హత్యకు గురయ్యాడు. సౌదీ అరేబియాలోని దమ్మాం నగరంలో తెలంగాణ ప్రవాసీయులు అధిక సంఖ్యలో నివసించే సికో బిల్డింగ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

  • తాగిన మైకంలో తోటి వ్యక్తితో వాగ్వాదంతో ఘటన

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి, మార్చి 1: సౌదీ అరేబియాలో సహచరుడి చేతిలో తెలంగాణ ప్రవాసీ దారుణ హత్యకు గురయ్యాడు. సౌదీ అరేబియాలోని దమ్మాం నగరంలో తెలంగాణ ప్రవాసీయులు అధిక సంఖ్యలో నివసించే సికో బిల్డింగ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సికో బిల్డింగ్‌లో నివాసముండే జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం పోశానిపేట గ్రామానికి చెందిన గుంట హన్మంతు నిర్మాణ రంగంలో కూలీ పనులు చేసుకుంటున్నాడు. శనివారం హన్మంతుతో పాటు అదే గదిలో ఉంటున్న మరో తెలంగాణ ప్రవాసీకి మధ్య తాగిన మైకంలో వాగ్వాదం జరిగింది.


దాంతో క్షణికావేశానికి లోనైన తోటి తెలంగాణ ప్రవాసీ హన్మంతుపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన హన్మంతు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య జరిగిన ప్రాంతంలో అధిక సంఖ్యలో తెలంగాణ ప్రవాసీయులు వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులకు దొరికితే తమ పరిస్థితి ఏంటని వారందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Updated Date - Mar 02 , 2025 | 05:01 AM