ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు!

ABN, Publish Date - Feb 14 , 2025 | 04:36 AM

బీసీలకు రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం ఒకటి; వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం మరొక బిల్లును పెట్టాలని యోచిస్తోంది.

  • ‘స్థానిక’ రిజర్వేషన్లపై ఒకటి.. విద్య, ఉద్యోగాలకు

  • మరొకటి.. అసెంబీల్లో పెట్టే యోచనలో సర్కారు

  • ఇక్కడ బిల్లు ఆమోదించినా.. అమలుకు పార్లమెంటుకే

  • కేంద్రం ఒప్పుకోకపోతే జాతీయ స్థాయిలో పోరాటం

  • చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): బీసీలకు రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం ఒకటి; వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం మరొక బిల్లును పెట్టాలని యోచిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్‌ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అదేవిధంగా విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లకు కూడా ఒక కమిషన్‌ నివేదిక అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఆ రంగాల్లో వారికి రిజర్వేషన్లు పెంచాలంటే దానికి ప్రాతిపదిక ఏంటన్న విషయంపై కమిషన్‌ నివేదిక అవసరమవుతుంది. బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో ఇప్పటివరకు ఉన్న ప్రాతినిధ్యాన్ని లెక్కించి, పరిశీలించి, కమిషన్‌ నివేదిక ఇస్తేనే ఆ ప్రక్రియకు బలం చేకూరుతుంది. కానీ, ఇప్పటికిప్పుడు మరో కమిషన్‌ వేసి, నివేదిక తెప్పించడానికి సమయం సరిపోతుందా? అన్న చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో నడుస్తోంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం తొలుత కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు విషయంపైనే కసరత్తు చేసింది. కానీ, తాజాగా బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను పెంచేందుకు అసెంబ్లీలో బిల్లు పెడతామని ప్రకటించింది.


ఈ నేపథ్యంలో రెండు ప్రత్యేక బిల్లులు అవసరమని భావిస్తోంది. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఒకే బిల్లును పెట్టలేదు. తమిళనాడులో రిజర్వేషన్లు అధిక శాతంగా ఉన్నా.. అవి విద్య, ఉద్యోగాల్లోనే ఉన్నాయి. అక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవు, విద్య, ఉద్యోగాల్లో మాత్రమే 69 శాతం మేర అమల్లో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ కూడా స్థానిక సంస్థలకు ఒకటి, విద్య, ఉద్యోగాలకు మరొక బిల్లు పెట్టాలనే ఆలోచన చేస్తోంది. ఈ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి పార్లమెంటుకు పంపి.. జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని భావిస్తోంది. కాగా, బిహార్‌లో బీసీలకు విద్య, ఉద్యోగాల్లో ఉన్న ప్రాతినిఽధ్యానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే చేసింది. ఆ సర్వేలోని వివరాల ఆధారంగా శాసనసభలో నేరుగా బిల్లు పెట్టి ఆమోదించింది. కానీ, ఆ చట్టానికి న్యాయస్థానాల్లో చుక్కెదురైంది. ఆ సర్వేలోని వివరాలకు సంబంధించి ఒక ప్రాతిపదిక, ఒక కమిషన్‌ ఇచ్చిన నివేదిక లేకపోవడమే దానికి కారణం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక నివేదికను ఇచ్చే బాధ్యతను కమిషన్‌కు అప్పగించడం అనివార్యంగా మారనుంది.


అమలుకు పార్లమెంటే మార్గం..

అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టే ఈ బిల్లులను ఏ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం లేదు. అయితే చట్టం అమలుకు అసెంబ్లీలో ఆమోదిస్తే సరిపోతుందా అంటే.. లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గతంలో కృష్ణమూర్తి కేసులో స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లలో 50శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు దేశమంతా వర్తిస్తుంది. అంటే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలి లేదా పార్లమెంటులో బిల్లు పెట్టించి ఆమోదింపజేసి.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. విద్య, ఉద్యోగాలకు సంబంధించి కూడా 50ు రిజర్వేషన్లు మించకూడదని ఇంద్రాసహాని కేసులో సుప్రీం తీర్పు ఇచ్చింది. దేశంలో ఎక్కడైనా స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉన్నాయా.. అంటే స్థానిక సంస్థల్లో ఎక్కడా లేవు. విద్య, ఉద్యోగాల్లో మాత్రం తమిళనాడుతో పాటు ఒకటి రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. అవి కూడా కొన్ని దశాబ్దాల కిందటి నుంచి అమల్లో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు మాత్రం రాజకీయ రిజర్వేషన్లకు మినహాయింపు. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా ఎస్టీలే ఉంటారు. జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లను ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో రాకే్‌షకుమార్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎక్కువగా ఉన్నాయి.

Updated Date - Feb 14 , 2025 | 04:36 AM